కార్తీకదీపం…దూకుడు పెంచిన ఏసీపీ రోషిణి..!

38
karthika deepam

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. ఇప్పటివరకు 1093 ఎపిసోడ్స్‌ పూర్తిచేసుకోగా రోజుకో మలుపుతో ఆసక్తికరంగా సాగుతోంది కార్తీకదీపం. దుర్గ గుర్తున్నాడా..? అంజీ గుర్తున్నాడా? ఏసీపీ ముందు వాళ్లని హాజరు పరిస్తే.. 25 తారీఖున నీకు పెళ్లి జరిగే సంగతి తర్వాత.. జైలుకి వెళ్లడం పక్కా అంటూ.. మోనితని భయపెడుతుంది దీప. ఇక ఇంటరాగేషన్‌‌లో భాగంగా ప్రియమణిని మళ్లీ పిలిచి ప్రశ్నలతోనే వణికిస్తుంది రోషిణీ. తన అసలు పేరు పైడమ్మా అని చెప్పడంతో సీన్ కామెడీగా మారిపోతుంది. నువ్వు నిజాలు చెబితే మీ మోనిత మేడమ్.. నిన్ను చంపేస్తుందని నాకు అర్థమవుతుంది అని రోషిణి అనగానే తనకు నిజంగానే నాకే తెలియదమ్మా అంటుంది పైడమ్మా.

అవును.. మీ అమ్మగారికి ఫోన్ చేద్దాం అని ఫోన్ తీసి.. ఎందుకు చెయ్యలేదు అని రోషిణీ అడగడంతో.. నేను అసలు ఫోనే తియ్యలేదమ్మా అంటూ అబద్దం చెబుతుంది పైడమ్మా. సీసీ కెమెరా రికార్డ్‌ని చూపించడంతో బిత్తరపోతుంది. మరి ఫోన్ తీసిన దానివి ఎందుకు చెయ్యలేదు అంటుంది రోషిణి. కార్తీక్ మీ అమ్మగారి దగ్గర వస్తూ ఉంటాడా? అని రోషిణి అడగగా వస్తూ పోతూ ఉంటాడమ్మా అంటుంది పైడమ్మా.

వాళ్లిద్దరూ ఏం చేస్తుంటారు? అంటుంది రోషిణి. మాట్లాడుకుంటూ ఉంటారు అని ప్రియమణి అనడంతో.. మాట్లాడుకున్నాక? అని రోషిణీ అడుగుతుంది. మాట్లాడుకుంటూనే ఉంటరమ్మా అని ప్రియమణి చెప్పడంతో.. ఎహే ఆపు.. మాట్లాడుకుంటూనే ఉంటే మీ మోనితమ్మ తల్లి ఎలా అయ్యింది? అని ఆవేశంగా ప్రశ్నించగా మోనితమ్మ కాస్త ఎక్కువ ప్రేమించిందమ్మా.. కార్తీక్ అయ్య కాస్త తక్కువ ప్రేమించారమ్మా అంటుంది పైడీ.

మోనిత తల్లి కావడానికి కార్తీక్ అయ్యే కారణం అమ్మా.. నేను రాకముందే కార్తీక్ అయ్య మోనితని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారటమ్మా.. ఓసారి పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయిందట.. కార్తీక్ అయ్య వాళ్ల అమ్మగారు ఆపేశారటమ్మా.. అని చెబుతుంది . దీంతో ఆలోచనలో పడుతుంది రోషిణి. దీపతో పాటు మోనిత ఇంటికి వెళ్లొచ్చిన భాగ్యం.. భర్తతో జరిగింది చెప్పి.. నీ కూతురు కాపురం చక్కబడినట్లే అంటుంది.

దీప చేసిన వంటకాలు బాగున్నాయని ఆనందరావు సంబరంగా తింటుంటే.. కార్తీక్ తినకుండా కంచంలో గీతలు గీస్తూ ఉంటాడు. దాంతో ఏమైంద్రా? గీతలు గీస్తున్నావ్ అని ఆనందరావు అడగడంతో అవును తాతయ్యా.. డాడీ ఇంట్లో కూడా గోడ మీద కూడా గీతలు గీస్తున్నాడు అని మోనిత గీసిన గీతల గురించి ప్రస్తావిస్తుంది సౌర్య. మొత్తానికి ప్రియమణి అసలు పేరు పైడమ్మ అని తెలియగా మరిన్ని వివరాలు తర్వాత ఎపిసోడ్స్‌ తెలియనున్నాయి.