మోడీని హిట్లర్‌తో పోల్చిన వర్మ..!

178
Ram Gopal Varma

సంచలన డైరెకర్ట్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు.. ఎప్పుడు ఏం చేస్తాడో కూడా తెలియదు.. ఎవరో ఒకరిని తిడుతూ వార్తల్లో నిలుస్తాడు. వివాదాలు లేనిదో పూట గడవని వర్మ.. ఎవరినో ఒకరిని వివాదాల్లోకి లాగి ఆనందపడుతుంటాడు. వర్మతో పెట్టుకోవడం అంటే అది వాళ్లకే రిస్క్ అనేంతలా పరిస్థితి తయారైంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించిన వర్మ.. వీలు చిక్కినప్పుడల్లా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని, టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. చెడుగుడు ఆడేస్తాడు.

అయితే గత కొద్దికాలంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసిన వర్మ కొత్త కాంట్రవర్సీకి తెర తీశారు. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఓ వివాదాస్పద ఫోటోను ట్వీట్ చేశారు. జర్మన్ నియంత, రెండో ప్రపంచ యుద్ధ కారకుడు అడాల్ఫ్ హిట్లర్, మోదీ సేమ్ టూ సేమ్ అంటూ ఓ ఫోటో పోస్ట్‌ చేశారు. అప్పట్లో హిట్లర్ ఓ చిన్నపాప చెవులను పట్టుకుని ఉండగా, మోడీ ఇటీవల అదే విధమైన పోజ్‌తో చిన్నారితో ఉన్న ఫోటోను పక్కపక్కన పెట్టారు వర్మ. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ మారింది.