జగ్గారెడ్డికి బ్రేక్ వేసింది ఎవరో తెలుసా..!

295
jagga reddy
- Advertisement -

జగ్గారెడ్డి…రాజకీయాల గురించి కాసింత అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న జగ్గారెడ్డి ఎన్నికలకు ముందు అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి గెలిచిన ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే.  సంగారెడ్డి నుండి స్వల్ప మెజార్టీతో గెలిచిన జగ్గారెడ్డి అప్పటి నుండి తన స్వరం మార్చారు.

టీఆర్ఎస్‌లో చేరేడమే లక్ష్యంగా పావులు కదిపారు. కాంగ్రెస్‌ పై విమర్శలు చేస్తూనే సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్‌పై ప్రశంసలు గుప్పించారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గుడి కడతానని జగ్గారెడ్డి ప్రకటించారు. దీంతో అంతా ఆయన టీఆర్ఎస్‌లో చేరడం లాంఛనమే అనుకున్నారు.

అయితే జగ్గారెడ్డి కారెక్కడానికి సిద్ధంగా ఉన్నా ఆయన్ని చేర్చుకోవడానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతగా ఆసక్తి చూపించడం లేదట. జగ్గారెడ్డికి బ్రేక్ వేసింది హరీష్ రావు అని అంతా భావించారు. కానీ అసలు వ్యక్తి హరీష్ కాదంట.

జగ్గారెడ్డిపై టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చింతా ప్రభాకర్‌. సంగారెడ్డిలో టీఆర్ఎస్ ఓటమి తర్వాత చింతాకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని గులాబీ బాస్ మాటిచ్చారట. దీనికి తోడు చింతా వర్సెస్ జగ్గారెడ్డి సంగారెడ్డిలో వీరిద్దరి అనుచర వర్గానికి అసలు పడదు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లోకి వస్తే పరిస్థితులన్నీ తారుమారు అయ్యే నేపథ్యంలో జగ్గారెడ్డిని చేర్చుకోవడానికి కేటీఆర్‌ అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. దీంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం సాధ్యమయ్యే పరిస్థితి కాదని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

- Advertisement -