మేమిద్దరం…మాకు నలుగురు:మంచు విష్ణు

261
manchu vishu

హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కానున్నాడు. ఆయన సతీమణి విరోనికా త్వరలో ఇంకో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు విష్ణు. త్వరలోనే తమ కుటుంబంలోకి మరొక ఏంజెల్ రాబోతోందని ట్వీట్ చేశారు. ప్ర‌పంచంలో మోస్ట్ బ్యూటీఫుల్ ఫీలింగ్ క‌లుగుతుంది. చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌గా ఉందని పేర్కొన్నారు.

ఇప్ప‌టికే మా కుటుంబ‌లో ఆరియానా, వివియానా, ఆవ్రామ్ వ‌చ్చారు. ఇప్పుడు నాలుగో దేవ‌త కూడా రాబోతుందని భార్య విన్నీతో ఉన్న ఫోటోల‌ను పోస్ట్ చేశారు విష్ణు. అభిమానులంద‌రూ మంచు విష్ణు దంపతుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

ప్రస్తుతం విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ పనులతో పాటు ‘ఓటర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కార్తిక్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.