హైకోర్టు తీర్పు సంతోషాన్నిచ్చింది:ఆర్జీవీ

173
rgv
- Advertisement -

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వరుస సినిమాలతో టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ మర్డర్‌తో పాటు దిశా ఎన్‌కౌంటర్‌పై మూవీని తెరకెక్కించారు. అయితే ఈ రెండు సినిమాలపై వివాదం నడుస్తుండగా ఈ రెండు సినిమాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆర్జీవీ…తాను చాలా సినిమాలు తీశాను, రియల్ లైఫ్ లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. నేనెప్పుడూ ఇది రియల్ స్టోరీ అని ఎప్పుడు చెప్పలేదు, కొన్ని సంఘటనల ఆధారంగా నేను తయారు చేసుకున్న కథ ఈ మర్డర్ సినిమా అంటూ తెలిపారు. హైకోర్టు తీర్పు సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడించారు.

ఈ సినిమాలో అమృత ప్రణయ్ అనే పేర్లు పెట్టలేదు,నేనెప్పుడూ వాళ్ళ స్టొరీనే తీస్తున్నాను అని చెప్పలేదు అంటూ తనదైన ధోరణిలో చెప్పుకొచ్చాడు ఆర్జీవి. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతుంటాయి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా తీశాను అని స్పష్టం చేశారు ఆర్జీవీ.

- Advertisement -