హిట్లర్ రూల్స్‌…మాస్టర్ కెప్టెన్సీ రచ్చ రచ్చ!

34
master

బిగ్ బాస్ 4తెలుగు 9వ వారంలో కెప్టెన్‌గా ఎంపికయ్యారు అమ్మా రాజశేఖర్‌. కొత్త రూల్స్‌తో ఇంటి సభ్యుల దిమ్మ తిరిగేలా చేశాడు. అరియానాను ఏ ప‌నీ చేయ‌నీయ‌కుండా త‌న‌ అసిస్టెంటుగా నియ‌మించుకున్నాడు. మైకు మ‌ర్చిపోతే జైలుకు … నిద్ర పోతే బెడ్‌రూమ్ మొత్తం శుభ్రం చేయాల‌ని ఆదేశించాడు. ఇంగ్లీషులో మాట్లాడితే త‌న‌కు న‌చ్చినంత సేపు నిల‌బెడ‌తాన‌ని చెప్పి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాడు మాస్టర్‌.

మాస్టర్ నిబంధనలతో చిర్రెత్తుకొచ్చిన హారిక ..హిట్లర్‌లా రూల్స్ పెడతానని అనుకుంటున్నాడు ఇది సరికాదన్నారు. ఆయన గొప్పైతే ఆయన దగ్గరే ఉంచుకోమని మండిపడగా అభిజిత్ కూడా ఏ మాత్రం టైం దొరికినా మాస్టర్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో అభిజిత్ ఫ్ర‌స్టేష‌న్‌లో పొర‌పాటున‌ రెండు ఇంగ్లీషు ముక్క‌లు మాట్లాడాడో లేదో తెలుగులో మాట్లాడాల‌ని బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. అది వినిపించ‌డంతోనే బుస‌లు కొడుతున్న పాములా మాస్ట‌ర్ వెంట‌నే లేచి చ‌ప్ప‌ట్లు కొడుతూ విల‌నిజం ప్ర‌ద‌ర్శించాడు. త‌ను చెప్పేంత‌వ‌ర‌కు నిల‌బ‌డ‌మ‌ని ప‌నిష్మెంట్ ఇచ్చాడు. దీంతో అభిజిత్ చేసేదేమీ లేక పనీష్‌మెంట్ అనుభవించాడు. మొత్తంగా తొలిరోజే మాస్టర్ ఇంటి సభ్యులకు చుక్కలు చూపించగా మిగితా రోజుల్లో ఇక రచ్చ రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.