వర్మ మార్క్ విజయవాడ… ‘వంగవీటి’

479
Review : Vangaveeti
- Advertisement -

వ్యక్తుల కథలనూ, నిజ జీవితంలో జరిగిన సంఘటనలను సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ శైలే వేరు. తనదైన మార్క్‌ను జోడించ…ఫ్రీ పబ్లిసిటీతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సామర్థ్యం ఆర్జీవీది. అయితే, కొంతకాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడంలో ఫెయిల్ అవుతున్నవర్మ…. తెలుగులో ఇదే నా చివరి సినిమా అంటూ భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన సినిమా వంగవీటి. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన వంగవీటితో వర్మ….శివ రేంజ్ సక్సెస్ అందుకున్నాడా లేదా చూద్దాం..

కథ:

విజయవాడలో వెంకటరత్నం నీడలో ఎదిగిన ఓ రౌడీ రాధా (సందీప్‌కుమార్‌). అయితే వెంకటరత్నం తనని తప్పుగా అర్థం చేసుకొని, అవమానించడంతో పగతో రగిలిపోతాడు. అదే సమయంలో అనుచరులు రెచ్చగొట్టడంతో వెంకటరత్నంని చంపేస్తాడు. దీంతో విజయవాడ మొత్తం తన చేతుల్లోకి వచ్చేస్తుంది. అదే సమయంలో కళాశాలలో చదువుకొంటున్న గాంధీ (కౌటిల్య), నెహ్రూ (శ్రీతేజ్‌) సోదరులు రాధాకి దగ్గరవుతారు. ఈ క్రమంలో ఓ స్టూడెంట్ యూనియన్‌ను స్ధాపిస్తారు. అయితే, అనుకోని పరిస్థితుల్లో రాధా ప్రత్యర్థుల చేతుల్లో హతమవుతాడు. తర్వాత రాధా వారసుడిగా ఆయన తమ్ముడు రంగా ఎంట్రీ ఇస్తాడు. కానీ గాంధీ, నెహ్రులతో రంగాకి విభేదాలు ఏర్పడతాయి. దీంతో గాంధీ, నెహ్రు కొత్త యూనియన్‌ స్థాపిస్తారు. తర్వాత గోడవలు పెరిగి రంగా అనుచరుల చేతిలో గాంధీ హత్యకి గురవుతాడు. గాంధీ హత్యకి ఆయన చిన్న తమ్ముడు మురళి (వంశీ చాగంటి) ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? నెహ్రూ తన కుటుంబం కోసం, వర్గం కోసం ఏం చేశాడు? రంగా హత్య ఎలా జరిగింది? అన్నది తెరమీద చూడాల్సిందే.

Review : Vangaveeti

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ ఫస్టాఫ్, వర్మ మార్క్ టేకింగ్, యాక్షన్ సీన్స్. అందరికీ తెలిసిన కథనే చెప్పాడు రాంగోపాల్‌ వర్మ. కేవలం పాత్రలే కనిపించాలనే ఉద్దేశ్యంతో దాదాపు అంతా కొత్త వారితోనే వంగవీటి సినిమాను తెరకెక్కించాడు వర్మ. 1980 నాటి వాతావరణాన్ని చాలా సహజంగా చూపించారు వర్మ. పాత్రలకి తగ్గట్టుగా నటీనటుల్ని ఎంపిక చేసుకొన్న విధానం చాలా బాగుంది.కీలకమైన వంగవీటి రాధ, వంగవీటి రంగా పాత్రల్లో కనిపించిన సందీప్ కుమార్, ఆవేశపరుడైన రౌడీగా.. ఆలోచన ఉన్న రాజకీయ నాయకుడిగా బాగా నటించాడు. రంగా భార్య పాత్రలో నైనా గంగూలీ ఆకట్టుకుంది. పెళ్లికి ముందు అల్లరి అమ్మాయిగా.. తరువాత హుందాగా కనిపించే రంగా భార్యగా మంచి వేరియేషన్స్ చూపించింది. వంశీ చాగంటి ఈ సినిమాలో దేవినేని మురళీ పాత్రలో మెప్పించాడు. అన్న మరణంతో రగిలిపోయే పాత్రలో వంశీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇతర పాత్రల్లో వంశీ నక్కంటి, కౌటిల్య, శ్రీ తేజ్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్, డైలాగ్స్,వాస్తవానికి అద్దం పట్టేలా చెప్పకపోవడం,మితిమీరిన రక్తపాతం.కథలో ప్రతి హత్యకీ కారణమేంటన్నది స్పష్టంగా చూపించారు కానీ.. రంగా హత్యకి కారకులెవరన్నది మాత్రం బయట పెట్టలేదు. పాత్రలకున్న చరిత్రను వర్మ చాలా వరకూ చూపించకుండా చాలా సాధారణంగా సినిమాని ముగించాడు. ఈ సినిమాలో ఎక్కువగా ఉన్న హింస, హత్యలు, రక్తపాతం కొంత మంది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.

Review : Vangaveeti

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా కూడా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. సంగీతం, ఛాయాగ్రహణం కథ మూడ్‌కి తగ్గట్టుగానే కుదిరాయి. వర్మ గత సినిమాల కంటే వంగవీటి చాలా బాగుంది. ఎడిటింగ్, డైలాగులు చాలా బాగున్నాయి. హత్యలు, వాటిని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో నటీనటుల నుండి సరైన నటనను రాబట్టుకోవడంలో వర్మ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. వర్మ టేకింగ్లో కొత్తదనమేమీ లేకపోయినప్పటికీ ఒరిజినల్ పాత్రలను పోలి ఉండేలా నటులను ఎంచుకోవడంలో వర్మ తన అద్భుతమైన టాలెంట్ ను చూపాడు.నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిర్మాణ్ విలువలు గొప్పగా ఉన్నాయి. సినిమాకు 80ల నాటి లుక్ తీసుకురావడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన కృషి మెచ్చుకోదగ్గదిగా ఉంది.

తీర్పు:

విజయవాడ వర్గాల నేపథ్యంలో సినిమా తీస్తున్నాడనగానే సున్నితమైన అంశాలతో ముడిపడ్డ ఆ గాథని తెరపై ఎలా చూపిస్తారో అనే ఆత్రుతని వ్యక్తం చేశారంతా. కానీ వర్మ మాత్రం వివాదాస్పదమైన విషయాల జోలికి వెళ్లలేదు. కులాలూ, పార్టీల ప్రస్తావన పెద్దగా తీసుకు రాలేదు. అసలు కథ ఏంటో తెలీనివారికి వర్మ మార్క్ లో ఉండే రొటీన్ రివెంజ్ డ్రామా వంగవీటి.

విడుదల తేదీ:12/23/2016
రేటింగ్: 3/5
నటీనటులు:సందీప్‌కుమార్,కౌటిల్య,శ్రీతేజ్‌,వంశీ చాగంటి,నైనా గంగూలీ
సంగీతం: రవిశంకర్‌
నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్‌
కథ, కథనం, దర్శకత్వం: రాంగోపాల్‌ వర్మ

- Advertisement -