రివ్యూ: సప్తగిరి ఎక్స్ ప్రెస్

142
Review : Sapthagiri Express

హాస్యనటులు హీరోలుగా అవతారం ఎత్తడం తెలుగు చిత్రసీమకు కొత్తేమీ కాదు. అలీ దగ్గరి నుంచి సునీల్ వరకు కామెడీయన్ నుంచి హీరోగా తమ అదృష్టాన్ని పరిక్షించుకున్న వారే. తాజాగా ఆ లిస్టులో సప్తగిరి కూడా చేరిపోయాడు. ‘పరుగు’, ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రాల్లో తనదైన కామెడీని పండించి ప్రేక్షకులను మెప్పించిన సప్తగిరి…హీరోగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ నేడు ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఆడియో ఫంక్షన్‌కి పవన్ ముఖ్యఅతిధిగా రావటం….సినిమా చూస్తానని ప్రకటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటివరకు తనదైన కామెడీని పండించిన సప్తగిరి…హీరోగా అదే స్ధాయిలో నవ్వులూ పండించాడా? లేదంటే ‘హీరోయిజం’ కోసం ఆరాటపడ్డాడా? ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథ:

శివ ప్రసాద్‌ (శివ ప్రసాద్‌) ఓ నిజాయతీగల కానిస్టేబుల్‌. తనయుడు సప్తగిరి (సప్తగిరి)ని మాత్రం ఐఏఎస్‌ చేయాలనుకొంటాడు. కానీ సప్తగిరికి సినిమాలూ, నాటకాలంటే పిచ్చి. సినిమా నటుడవ్వాలని కలలు కంటుంటాడు. తన కాలనీకి కొత్తగా వచ్చిన పూర్ణిమ (రోషిణి ప్రకాష్‌) వెంట పడుతుంటాడు. ఓ ఎన్‌కౌంటర్‌లో శివప్రసాద్‌ని దారుణంగా చంపేస్తారు.అలాంటి టైమ్ లో అనుకోకుండా పెద్ద కష్టం ఎదురై సప్తగిరి తన సినిమా లక్ష్యాన్ని పక్కనబెట్టి పోలీస్ ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. తన తండ్రి మరణం వెనుక మనుషులున్నారన్న సంగతి తెలుసుకొన్న సప్తగిరి ఏం చేశాడు? ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు? అనేదే కథ.

Review : Sapthagiri Express

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ సప్తగిరి,కామెడీ సీన్లు,తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌. సినిమా ఓపెనింగ్‌లో పురాణాల్లోని శ్రీరామ కళ్యాణ ఘట్టంలో వచ్చే పరశురాముడి వేషంలో సప్తగిరి చాలా బాగా నటించాడు. పరుశరాముడి వేశదారణలో డైలాగులో ప్రేక్షకుల చేత ఈలలు వేయించాడు. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో కానిస్టేబుల్ కాణిపాకం(షకలక శంకర్) పై నడిచే కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి. సెకండాఫ్ లో కానిస్టేబుళ్ల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయి అనేది బాగా చూపారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కామెడీ సీక్వెన్స్ ఒకటి సెకండాఫ్ మొత్తానికి హైలెట్ గా నిలిచి బాగానే నవ్వించింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో వచ్చే చిన్నపాటి ట్విస్టులు కాస్త థ్రిల్లింగా అనిపించాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ రొటీన్‌ కథ, సెకండాఫ్. ఫస్టాఫ్‌లో సప్తగిరి డైలాగ్ సీన్స్ మినహాయిస్తే సప్తగిరికి అతని ఫ్రెండ్స్ పై నడిచే కొన్ని కామెడీ, అనవసరపు సన్నివేశాలు చికాకు పెట్టాయి. తండ్రిని చంపిన వాడిని అంతమొందించే రివేంజ్‌ డ్రామా మాత్రం అతకలేదు. దాన్ని మరీ కామెడీ చేశారు. అంతర్లీనంగా ఓ సీరియస్‌ విషయం ఉన్నా.. దాన్ని సప్తగిరి కోసం కామెడీగా మార్చేయడంతో కథలో సీరియస్‌నెస్‌ తగ్గింది. మధ్యలో వచ్చే పాటలు మరింత చిరాకు తెప్పించాయి.

Review : Sapthagiri Express

సాంకేతిక విభాగం :

చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో నిర్మాత ఎక్కడ రాజీ పడలేదు. అందుకే ప్రతీ సీన్‌ రిచ్‌గా కనిపిస్తుంది. ఓ మాస్‌ హీరోకి తగిన పాటలిచ్చాడు సంగీత దర్శకుడు. మాటలు అక్కడక్కడ ఆకట్టుకొంటాయి. తమిళ సినిమా నుండి తీసుకున్న ఈ కథను మన నేటివిటీకి తగ్గట్టు మార్చుకున్న దర్శకుడు అరుణ్ పవార్, హీరో సప్తగిరిలు కథ, కథనాల్లో ఎక్కడా సీరియస్ నెస్ మైంటైన్ చేయలేకపోయారు. ఎడిటింగ్ సరిగా లేకపోవడంతో పాత్రల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ కలిగింది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది.

తీర్పు :

తెలుగు తెరపై ఎందరో కామెడీయన్లు హీరోలుగా తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. అలాంటి కొంతమంది సక్సెస్ కాగా మరికొంతమంది తిరిగి కామెడీ ట్రాక్ వైపే దృష్టిసారించారు. స్టార్ కమెడియన్ సప్తగిరి ఈ ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ గొప్ప ఆరంభం కాదనే చెప్పాలి. ఫస్టాఫ్ కామెడీ, సప్తగిరి నటన, క్లైమాక్స్ లో వచ్చే థ్రిల్స్ ప్లస్ పాయింట్స్ కాగా…రోటిన్ కథ, సెకండాఫ్ సినిమాకు మైనస్ పాయింట్స్. మొత్తంగా స్పీడు తక్కువైన నవ్వులు పూయించే సప్తగిరి ఎక్స్ ప్రెస్.

విడుదల తేదీ : 23/12/2016
రేటింగ్ : 3/5
నటీనటులు : సప్తగిరి, రోషిని
సంగీతం : బుల్గేనిన్
నిర్మాత : డా. రవి కిరణ్
దర్శకత్వం : అరుణ్ పవార్

Review : Sapthagiri Express