స్వచ్ఛ సర్వేక్షన్‌‌….వావ్ హైదరాబాద్

97
Hyderabad boost Swachh Survekshan rankings

సీఎం కేసీఆర్ సారధ్యంలో స్వచ్ఛ హైదరాబాద్ సాధనలో తెలంగాణ ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షన్‌..వావ్ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. స్వచ్ఛ భారత్ లో ప్రస్తుతం 19వ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరాన్ని టాప్ 5లోకి తీసుకెళతామన్నారు. రాష్ట్రంలోని 73 అర్బన్ లోకల్ బాడీలను స్వచ్ఛంగా మారుస్తామన్నారు కేటీఆర్.

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో తడి,పోడి చెత్తనే వేర్వేరుగా సేకరిస్తున్నామని తెలిపారు. 2వేల ఆటోలతో చెత్తను సేకరిస్తున్నామన్నారు. స్వచ్ఛ ఉద్యమం అంటే టాయిలెట్ల నిర్మాణం మాత్రమే కాదని…మౌలిక సదుపాయలు కల్పించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.ఐటీసీ, రాంకీ, కామినేనిలు స్వచ్ఛ హైదరాబాద్ కు సహకరిస్తున్నాయని…..ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. స్వచ్ఛ సంకల్పం తీసుకున్న జీహెచ్ఎంసీకి అభినందనలు తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షన్‌….వావ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టిన జీహెచ్‌ఎంసీ….ఇందుకు సహకరించిన మంత్రి కేటీఆర్‌ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభినందించారు. స్వచ్ఛతపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ప్రధానమంత్రి అన్ని రంగాలను క్లీన్ చేస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్‌లో ప్రజలందరు సైనికులు కావాలని పిలుపునిచ్చారు. అంతకముందు స్వచ్ఛ కిట్‌, పోస్టర్‌, రింగ్ టోన్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

జీహెచ్‌ఎంసీ, ఐటీసీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, మేయర్ రామ్మోహన్,మంత్రులు తలసాని,పద్మారావు, ఎంపీ సీతారాం నాయక్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.