రివ్యూ: ఒక్క క్షణం

400
Review Okka Kshanam
- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయమైన హీరో అల్లు శిరీష్‌. గౌరవం, కొత్త జంట,శ్రీరస్తు శుభమస్తు ఆకట్టుకున్న శిరీష్‌ తాజాగా ఆనంద్ దర్శకత్వంలో ఒక్క  క్షణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 1971: బియాండ్‌ బోర్డర్స్‌ అనే మలయాళ మూవీకి రిమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా…?అల్లు శిరీష్‌కు హిట్ ఇచ్చిందా లేదా చూద్దాం…

కథ :

జీవ (శిరీష్), జ్యోత్స్న (సురభి) ని షాపింగ్ మాల్ లో చూసి ప్రేమలో పడతాడు. జ్యోత్స కూడా జీవని ప్రేమిస్తుంది. వీరుండే అపార్ట్‌మెంట్‌లోనే ఉండే  శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) ల  జీవితంలో జరిగే సంఘటనలే వీరి జీవితంలో కూడా జరుగుతున్నాయని గ్రహిస్తారు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే చిక్కులు  ఎంటీ…?అసలు జీవ,శ్రీనివాస్‌ల జీవితాలు ఎలా ఒకేలా నడుస్తుంటాయి..?ఈ ప్రమాదం నుంచి జీవ ఎలా గట్టెక్కాడు అన్నదే ఒక్క క్షణం కథ.

Review Okka Kshanam
ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ,సాంకేతిక విభాగం,సెకండాఫ్‌. అల్లు శిరీష్‌ అటు జోవియల్‌గానూ, ఇటు సీరియస్‌ అద్బుత నటన కనబర్చాడు. తన గతసినిమాల కంటే వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్నాడు.  సీరత్‌ కన్నా సురభి చాలా గ్లామరస్‌గా కనిపించింది. అవసరాల శ్రీనివాస్‌ అంటే కామెడీ అనుకుంటారు. తను కూడా సీరియస్‌ రోల్‌లోనే కనిపిస్తాడు.చాలా రోజుల తర్వాత దాసరి అరుణ్‌కుమార్‌ తెరపై కనిపించాడు. ఆయన పాత్ర షాకింగ్‌గా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ ఫస్టాఫ్. ఫస్టాఫ్‌ సినిమా కాస్త నిదానంగా మొదలైనట్లు కనిపిస్తుంది. స్వాతి ఫ్లాష్‌బ్యాక్‌ను కమర్షియల్‌ ఫార్మాట్‌లో చెప్పడంతో కాస్త నిరాశ పరుస్తుంది. దర్శకుడు ఎంచుకున్న కథాంశం, దాన్ని స్పష్టంగా వివరించడానికి తయారుచేసుకున్న కథనం బాగానే ఉన్నా అందులో రాసుకున్న సన్నివేశాలే కొంత బలహీనంగా కనబడ్డాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి.  కెమెరా, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. స్క్రీన్‌ప్లే ప్రధానమైన సినిమా ఇది. కాన్సెప్ట్‌ కొత్తగా ఉండటంతో ఫ్రెష్‌ లుక్‌ వచ్చింది.కొత్త తరహా కథలను ఎంచుకునే వి.ఐ.ఆనంద్‌ మరోసారి ఓ కొత్త పాయింట్‌తో ఆకట్టుకున్నాడు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్  బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Review Okka Kshanam
తీర్పు :

ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని ప్యార్లల్ లైఫ్ చిత్రం  ఒక్క క్షణం. ఆసక్తికరమైన కథ, కథలోని మలుపులు ,ప్రీ క్లైమాక్స్ సినిమాకు ప్లస్ పాయింట్‌ కాగా కథ, కథనాలకు తగిన బలమైన సన్నివేశాలు లేకపోవడం మైనస్ పాయింట్స్‌. మొత్తంగా కొత్తదనాన్ని కొరుకునే ప్రేక్షకులకు నచ్చే చిత్రం ఒక్క క్షణం.

విడుదల తేదీ : 28/12/ 2017
రేటింగ్ : 3/5
నటీనటులు : అల్లు శిరీష్, సురభి
సంగీతం : మణిశర్మ
నిర్మాత : చక్రి చిగురుపాటి
దర్శకత్వం : విఐ ఆనంద్

- Advertisement -