త్వరలోనే హైకోర్టు ఏర్పాటు చేస్తాం- రవిశంకర్‌

224
ravishankar talk about ts hi court in lok sabha
- Advertisement -

జై తెలంగాణ నినాదాలతో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్‌ ఎంపీలు నిన్న(బుధవారం) లోక్‌సభలో గళమెత్తిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు కూడా పార్లమెంటులో పట్టుబట్టారు.

టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. హైకోర్టు జడ్జిల నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా లోక్ సభలో వాగ్వాదం చోటు చేసుకుంది.

అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ అంశంపై ప్రకటన చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఏపీలో హైకోర్ట్‌ కోసం భవనం వెతుకుతున్నామని, కొత్త భవనం దొరకగానే హైకోర్టు ఏర్పాటు చేస్తామని రవిశంకర్‌ స్పష్టం చేశారు. జడ్జిల కేటాయింపు అంశాన్ని హైకోర్టు కొలిజీయం పరిశీలిస్తుందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.

అంతేకాకుండా ప్రస్తుతమున్న హైకోర్టు తెలంగాణకే చెందుతుందని, ఏపీకి నూతన హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు నిధులిచ్చామని, హైకోర్టు కోసం ఏపీ సీఎం చంద్రబాబు స్థలం కేటాయించాల్సి ఉందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. జడ్జీలతో సంప్రదించి హైకోర్టు స్థలంపై ప్రతిపాదనలు చేయాలన్నారు. రెండు రాష్ట్రాల పరస్పర సహకారంతో హైకోర్టు విభజన సమస్య పరిష్కరిస్తమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.

- Advertisement -