జై సింహా షూటింగ్ పూర్తి..

195
#NBK102 Jai Simha Shooting Wrapped Up
- Advertisement -

గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి  వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత న‌టసింహ బాల‌కృష్ణ, సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ‘జై సింహా’. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన నయ‌న‌తార‌, హ‌రి ప్రియ‌, న‌టాషా దోషి క‌థానాయిక‌లుగా నటించగా సి. కల్యాణ్ నిర్మించారు.

ప్యాచ్‌ వర్క్‌లు అంతా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. రామోజీ ఫిలిం సిటిలో గుమ్మడికాయ కొట్టిన నిర్మాత సి. కల్యాణ్‌ షూటింగ్ పూర్తైందని ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా తరహాలో ఈ సినిమా  ఉంటుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలను చిత్రయూనిట్ ఇప్పటివరకు ఖండించలేదు.

#NBK102 Jai Simha Shooting Wrapped Up

ఇక ఇటీవల విడుదలైన టీజర్‌లో బాలయ్య విశ్వరూపం చూపించారు. సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు.. సైలెంట్‌గా ఉందని కెలికితే తల కొరికేస్తాది అంటూ తన దైన శైలి భారీ డైలాగ్స్‌తో బాలయ్య ఆకట్టుకున్నాడు. మీసాలు మెలేసి.. కూలింగ్ గ్లాస్ పెట్టుకుని.. కర్ర చేతపట్టి శత్రువుల్ని చెడుగుడు ఆడేస్తూ యంగ్రీ మ్యాన్‌గా ఫస్ట్‌లుక్‌లో కనిపించిన బాలయ్య.. టీజర్‌లో ఫుల్ మాస్‌ లుక్‌లోకి మారిపోయాడు. ఇప్పటివరకు సింహా పేరుతో వచ్చిన బాలయ్య సినిమాలన్ని సూపర్ హిట్‌ కాగా జై సింహా కూడా గతరికార్డులను తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు.

- Advertisement -