రివ్యూ:నీది నాది ఒకే కథ..

280
Review Needi Naadi Oke Katha
- Advertisement -

అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో చిత్రాలతో మంచి గుర్తింపును,యూత్‌లో ఫాలోయింగ్‌ని పెంచకున్న హీరో శ్రీవిష్ణు. శ్రీవిష్ణు నుంచి సినిమా వస్తుందంటే అందులో మంచి మ్యాటర్ ఉంటుందనేలా ప్రేక్షకుల్లో గుర్తింపుని పొందాడు. తాజాగా వేణు ఉడుగుల దర్శకత్వంలో ‘నీది నాది ఒకే కథ’ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..

కథ :

రుద్రసాగర్ (శ్రీవిష్ణు) సామాన్యమైన సగటు విద్యార్థి. చదువంటే పెద్దగా ఆసక్తిలేని విద్యార్థి. స్నేహితులు,ఆటలు తప్ప మరోలోకం తెలియని యువకుడు. రుద్రసాగర్ తండ్రి(దేవీ ప్రసాద్) ప్రొఫెసర్. తన కొడుకు జీవితంలో మంచి స్ధాయిలో సెటిల్ అవ్వాలని తపన పడే తండ్రి. కానీ రుద్రసాగర్ పరిస్థితి చూసి ఆందోళనకు గురవుతాడు. ఈ క్రమంలో తన తండ్రి బాధ తెలుసుకున్న సాగర్ ఎలాగైన తండ్రి కోరుకున్నట్లుగా మారాలని ప్రయత్నిస్తాడు. కానీ ఈ ప్రయత్నంలో విసిగిపోయి తనకు చదువు అబ్బదని, ఇక పరీక్షలు రాయనని తండ్రికి రుద్రసాగర్ చెప్పేస్తాడు. కట్ చేస్తే రుద్రసాగర్, తన తండ్రికి మధ్య చోటుచేసుకొన్న పరిణామాలు ఏమిటి? రుద్రసాగర్ ఏం చేయాలనుకున్నాడు అన్నదే సినిమా కథ.

Review Needi Naadi Oke Katha

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,కథనం,శ్రీ విష్ణు నటన,సంగీతం. దర్శకుడు విజన్‌కు వెన్నెముకలా నిలిచింది శ్రీవిష్ణు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. మధ్య తరగతి యువకుడి పాత్రకు ప్రాణం పోసిన శ్రీ విష్ణు..పలికించిన హావభావాలు సూపర్బ్. ధార్మికగా నటి సట్నా టైటస్ తొలిసినిమానే అయినా చాలా మెచ్యురిటీతో కూడిన అభినయాన్ని ప్రదర్శించింది. కథలో కీలకమైన పాత్రను అవలీలగా మెప్పించింది. మిగితా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్,కామెడీ లేకపోవడం.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులేపడతాయి. సున్నితమైన కథను అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడు వేణు వంద శాతం సక్సెస్ సాధించాడనే చెప్పాలి. బలమైన ఎమోషనల్ సీన్స్‌తో ఆధ్యంతం ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమాకు మరో ప్రధానబలం నేపథ్య సంగీతం. సంగీత దర్శకుడు సురేష్‌ బొబ్బిలి తన నేపథ్య సంగీతంతో కథలోని భావోద్వేగాలను మరింతగా ఎలివేట్ చేశాడు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్‌,సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Review Needi Naadi Oke Katha
తీర్పు:

ప్రస్తుత విద్యావ్యవస్థలో ర్యాంకులు, మార్కులే విజ్హానికి ప్రామాణికంగా మారాయి. ర్యాంకుల కోసం పిల్లలను మరబొమ్మలుగా మారుస్తున్నారు. ఈనేపథ్యంలో విద్యావ్యవస్థలోని లోపాలు, పిల్లలపై తల్లిదండ్రుల ఒత్తిడి లాంటి ఓ సున్నితమైన పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమే నీది నాది ఒకే కథ. కథ,కథనం,శ్రీ విష్ణు నటన,దర్శకుడి ప్రతిభ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా కామెడీ లేకపోవడం మైనస్ పాయింట్స్. అతి సున్నితమైన సమస్యను సరిగా హ్యాండిల్ చేయకపోతే అది తెరమీద ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది. అలాంటి సబ్జెక్ట్‌ను అందర్ని మెప్పించేలా చేయడంలో దర్శకుడిగా వేణు నూటికి నూరు మార్కులు సొంతం చేసుకొన్నాడు. కమర్షియల్ అంశాలను అంతర్లీనంగా చూపిస్తూ సమాజాన్ని ఆలోచింపజేయడంలో సఫలమయ్యాడు. ఓవరాల్‌గా ప్రతిఒక్కరు చూడదగ్గ సినిమా నీది నాది ఒకే కథ.

విడుదల తేదీ:23/03/2018
రేటింగ్:3.5/5
నటీనటులు : శ్రీ విష్ణు, సాట్నా టిటస్‌
సంగీతం : సురేష్‌ బొబ్బిలి
నిర్మాత : నారా రోహిత్‌, ప్రశాంతి
దర్శకత్వం : వేణు ఊడుగుల

- Advertisement -