రివ్యూ : అప్పట్లో ఒకడుండేవాడు

333
Appatlo Okadundevadu
- Advertisement -

విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకోవడంలో హీరో నారా రోహిత్ స్టైలే వేరు. కథల ఎంపికలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించే రోహిత్ హీరోగా,సమర్పకుడిగా తెరకెక్కించిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. భిన్నమైన ఆలోచన,సమాజం.. అందులోని వ్యక్తులు.. భావోద్వేగాల కథతో నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. టైటిల్‌తోనే కాదు, సినిమా ప్రమోషన్‌లోనూ తనదైన మార్క్‌ని చూపించిన దర్శకుడు సాగర్‌…తెరపై కథను అంతే కొత్తగా చూపించారా..?విడుదలకు ముందే బాగా హైప్ క్రియేట్ చేసిన అప్పట్లో ఒకడుండేవాడు…అంతే స్ధాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం…?

కథ:

1992లో జరిగే కథే అప్పట్లో ఒకడుండేవాడు. రైల్వే రాజు (శ్రీవిష్ణు) క్రికెటర్‌ కావాలన్నది అతని జీవితాశయం. అమ్మ.. ఇల్లు.. క్రికెట్‌ తప్ప మరో ప్రపంచం తెలీదు. ఇందుకోసం బాగా ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో అదే కాలనీలో ఉండే నిత్య (తాన్య హోప్‌)ని ప్రేమిస్తాడు. జాతీయ జట్టులో రైల్వే రాజు స్థానం ఖాయమనుకొంటున్న దశలో.. తన జీవితంలోకి ఇంతియాజ్‌ (నారా రోహిత్‌) ప్రవేశిస్తాడు. అతనో నిజాయతీగల పోలీస్‌. నక్సలైట్లను ఏరి పారేసే పనిలో ఉంటాడు. ఈ క్రమంలో రైల్వే రాజును కలుస్తాడు. అసలు ఇంతియాజ్… రాజును ఎందుకు కలిశాడు..?తర్వాత ఏం జరుగుతుంది..?రాజుకు…ఇంతియాజ్‌కు జరిగే యుద్ధంలో ఎవరిది పై చేయి అవుతుంది అన్నది తెరమీద చూడాల్సిందే.

Appatlo Okadundevadu

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్…కథ,కథనం,నారా రోహిత్, నేపథ్య సంగీతం. నారా రోహిత్ తనదైన మార్క్ నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. రోహిత్ లుక్,బేస్ వాయిస్ సినిమాకు ప్లస్ అయింది. ఇక శ్రీ విష్ణుడ కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అమాయకమైన కుర్రాడిగా…..సమాజం మీద ఎదురుతిరిగే యువకుడిగా అద్భుతంగా నటించాడు. హీరోయిన్ తన్య పర్వాలేదనిపించింది. ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ,ప్రభాస్ శ్రీనులు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

పాటలు,సెకండాఫ్ ఫస్ట్ 15 నిమిషాలు. సెకండాఫ్‌లో చాలాసేపటి వరకూ నారా రోహిత్‌ పాత్రే కనిపించదు. రైల్వే రాజు – ఇంతియాజ్‌ల పోరాటం కాస్త వన్‌సైడ్‌ అయిపోతుంది. మళ్లీ ఇంతియాజ్‌ పాత్ర కనిపించేంత వరకూ కథ.. కథనాల్లో ఎక్కడా ఉత్కంఠత ఉండదు. ఆ ఎపిసోడ్లు బోర్‌ కొట్టిస్తాయి. పాటలు ఇబ్బందిగా అనిపిస్తాయి. మాటలు మరీ అంత లోతుగా లేకపోయినా.. ఎంత వరకూ వాడాలో అంతే వాడారు.

సాంకేతిక విభాగం:

అయ్యారే సినిమాతో దర్శకుడిగా మారిన సాగర్ కె చంద్ర… పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1992లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కథా రెడీ చేసుకున్న విధానం బాగుంది.ఆకట్టుకునే కథనం, నేపథ్య సంగీతంతో సినిమాను నడిపించాడు. పెద్దగా పాటలు అవసరం లేని కథలో సాయి కార్తీక్ అందించిన పాటలు స్పీడు బ్రేకర్లలా అనిపించాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

Appatlo Okadundevadu

తీర్పు:

టాలీవుడ్‌ విభిన్న కథా చిత్రాలతో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్న హీరో నారా రోహిత్. అప్పట్లో ఒకడుండేవాడుతో నిర్మాతగా మారిన రోహిత్….మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనే చెప్పాలి. కథ,కథనం, నారా రోహిత్ నటన,క్లైమాక్స్ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా పాటలు, సెకండాఫ్ 15 నిమిషాలు మైనస్ పాయింట్స్. మొత్తంగా 2016కు వీడ్కోలు చెబుతూ….2017కి గ్రాండ్ వెలకమ్‌ చెప్పే సక్సెస్ఫుల్ యాక్షన్ డ్రామా అప్పట్లో ఒకడుండేవాడు.

విడుదల తేదీ:12/30/2016
రేటింగ్:3.25/5
నటీనటులు: నారా రోహిత్, శ్రీవిష్ణు,తాన్య హోప్
సంగీతం: సాయి కార్తీక్‌
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్‌
రచన,దర్శకత్వం: సాగర్‌ కె.చంద్ర

- Advertisement -