నేటితో పాత పెద్దనోట్లకు సెలవు…..

104
Last Day To Deposit

రద్దయిన పెద్దనోట్ల గడువు నేటితో ముగుస్తోంది. డిసెంబర్‌30వతేది లోపు తమ అకౌంట్లో డిపాజిట్ చేసుకోలేని వారు దానికి సంబధించిన కారణాలు చూపించి….రిజర్వు బ్యాంక్‌ ప్రత్యేకించిన కౌంటర్లలో మార్చి31వ తేదీ వరకు మార్పిడి చేసుకోవచ్చు. కొత్తనోట్లకు విపరీతమైనం డిమాండ్‌ ఉండడం. ఆ మేరకు నోట్లను ముద్రించలేని పరిస్ధితి ఉన్నందున బ్యాంకులు, ఏటీఎంల వద్ద మరికొన్నిరోజులు క్యూలైన్ల ఇబ్బంది తప్పకపోవచ్చు.

నవంబర్‌ 8వతేదీన జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ అనూహ్యంగా, రూ.500,1000నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.నోట్ల రద్దు వల్ల నల్లకుభేరులకే కష్టంమని సామాన్యూలకు మేలు జరుగుతుందని మోడీ ఈ సందర్భంలో అన్నారు. అయిన కష్టాలు సామాన్యూడికే ఎక్కువగా కనిపిస్తున్నాయని,… నల్లకుభేరులు మాత్రం తమ పలుకుబడిని ఉపయోగించి డబ్బులు మార్చుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Last Day To Deposit

నోట్ల రద్దు నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. పార్లమెంట్‌ సమావేశాలను పూర్తిగా అడ్డుకుని, నిరసనలు కూడా చేపట్టాయి. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,…ముందస్తు చర్యలు తీసుకోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

బ్యాంక్‌లో, ఏటీఎంలలో నగదు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్‌ తరచూ నిబంధనల్లో మార్పులు చేర్పూలు చేస్తూ ప్రకటనలు విడుదల చేయడం వల్ల అటు బ్యాంకర్లు, ఇటు ప్రజలు ఒక్కింత గందగోళానికి గురయ్యారు. వారానికి రూ.24వేల వరకు,ఏటీఎంల ద్వారా రోజుకు రూ.2500వరకు విత్‌డ్రాకు ప్రభుత్వం అనుమతించినా….కొన్ని చోట్ల నగదు కొరత కారణంగా అనేక బ్యాంకులు చాలా తక్కువగానే ఖాతాదారులకు చెల్లించారు.

Last Day To Deposit

ప్రస్తుతం బ్యాంకుల్లో పరిస్థితి మెరుగుపడినా.. ఏటీఎంల వద్ద అదే క్యూలైన్లు కనిపిస్తున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల నుంచి విత్‌ డ్రా చేసే మొత్తాలపై పరిమితులు డిసెంబరు 30వ తేదీ తర్వాత కూడా కొనసాగవచ్చునని బ్యాంకర్లు అంటున్నారు. ఈ నియంత్రణల్ని ఎప్పుడు ఉపసంహరిస్తారనే దానిపై ప్రభుత్వం లేదా ఆర్‌బీఐ వివరణ ఇవ్వడం లేదు. ఉపసంహరణ పరిమితిపై డిసెంబరు 30వ తేదీ తర్వాత సమీక్షిస్తామని ఆర్థికశాఖ కార్యదర్శి అశోక్‌ లావాసా చెప్పారు.