89 క్రిమినల్ కేసులతో దేశంలోనే రేవంత్ రెడ్డి నంబర్ 1గా ఉన్నట్టు వెల్లడించింది ఏడీఆర్ సంస్థ. 30 రోజులు జైల్లో ఉన్న నాయకులను పదవి నుండి తొలగించే కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితా విడుదల చేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్.
దేశంలో 42% ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉండగా.. అందులో 89 క్రిమినల్ కేసులతో మొదటి స్థానంలో ఉన్నారు రేవంత్ రెడ్డి. వీటిలో 72 తీవ్ర ఆరోపణలు అంటే బెదిరింపు (IPC 506), సమాజంలో విభేదాలు రెచ్చగొట్టడం (IPC 153A, 505), ఎన్నికల సమయంలో అవకతవకలు, మోసం (IPC 420), మహిళలపై దాడి (IPC 354) వంటి కేసులు ఉన్నాయి.
తమిళనాడు CM ఎం.కె. స్టాలిన్ (DMK)పై 47 కేసులు ఉన్నాయి. ఇందులో 11 తీవ్రమైనవి. వీటిలో ఎన్నికల అవకతవకలు, సామాజిక విభజన రెచ్చగొట్టడం (IPC 153A), కిడ్నాప్ (IPC 363) వంటి ఆరోపణలు ఉన్నాయి.
Also Read:గాలిలోనే పేలిపోయిన ఫైటర్ జెట్
ఆంధ్రప్రదేశ్ CM చంద్రబాబు నాయుడు (TDP)పై 19 కేసులు ఉన్నాయి. వీటిలో మోసం (IPC 420), హత్యాయత్నం (IPC 307), అవినీతి (IPC 409), కుట్ర (IPC 120B) వంటి ఆరోపణలు ఉన్నాయి.

