ఈడీ ముందుకు రేవంత్‌..

211
ed revanth
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ నేత వేంనరేందర్‌ రెడ్డి,ఏ3గా ఉన్న ఉదయ్‌సింహను విచారించిన ఈడీ అధికారులు ఇవాళ రేవంత్‌ రెడ్డిని విచారించన్నారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు రూ.50 లక్షల నగదుతో పాటు రూ.4.50 కోట్లు ఎవరివి అని ప్రశ్నించనున్నారు.

ఓటుకు నోటు కేసు దర్యాప్తు సమయంలో ఏసీబీ అధికారులు అప్పట్లో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈడీ అధికారులు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. వేం నరేందర్‌రెడ్డి, ఉదయ్‌సింహ ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించి రేవంత్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.

ఇక ఉదయ్‌ సింహ విచారణ సందర్భంగా ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. రేవంత్‌, వేం నరేందర్‌, సెబాస్టియన్‌లతో ఎప్పటినుంచి పరిచయం ఉంది? డీల్‌ విషయం ఎక్కడ ఫైనల్‌ చేశారు? ఎన్నిక తర్వాత ఇవ్వజూపిన రూ.4.50 కోట్లు ఎక్కడెక్కడి నుంచి సమకూర్చారు? వంటి ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఉదయ్‌ సింహకు ఈడీ అధికారులు తెలిపారు.

- Advertisement -