తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మక రోజు:రేవంత్

24
- Advertisement -

తెలంగాణ ఏర్పాటులో డిసెంబర్ 9 ప్రత్యేకమైన రోజుగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని, ఆ రోజు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆరాటానికి దిశా నిర్దేశం జరిగిన రోజు అని అన్నారు.

ఆరు దశాబ్దాలుగా కొనసాగిన ఉద్యమం, వేలాది మంది ప్రజల కల, అపారమైన త్యాగాలకు అర్థం చేసుకున్న నాయకురాలు సోనియా గాంధీ అని రేవంత్ గుర్తుచేశారు. 2004 ఎన్నికల సమయంలో కరీంనగర్ వేదికగా సోనియా గాంధీ ఇచ్చిన మాటను ఎంతటి అవాంతరాలు వచ్చినా నిలబెట్టుకుని చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించారని ఆయన పేర్కొన్నారు.

“మా హృదయాలలో సోనియా గాంధీకి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. మా పాలనలో ఆమె స్ఫూర్తి ప్రతిఫలిస్తుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం వెనుక ఉన్న కీలక శక్తి సోనియా గాంధీ అని అభివర్ణించిన ఆయన, ఆమె ఇచ్చిన నమ్మకమే తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చిందని పేర్కొన్నారు.

డిసెంబర్ 9ను తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ జన్మదినంగా మాత్రమే కాకుండా, తెలంగాణ ఆవిర్భావ దిశగా ప్రారంభమైన చారిత్రాత్మక రోజుగా కూడా గుర్తించాలంటూ ప్రజలను పిలుపునిచ్చారు.

Also Read:చలిపులి..సింగిల్ డిజిట్‌కి ఉష్ణోగ్రతలు

- Advertisement -