జపాన్‌లో వచ్చిన భారీ భూకంపం కారణంగా ప్రభాస్ అభిమానులు కొంతసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. #BahubaliTheEpic ప్రమోషన్స్ కోసం డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జపాన్ ఉత్తర తీర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూకంపం నమోదై స్థానికులను, పర్యాటకులను కలవరపరిచింది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియా అంతా ప్రభాస్ గురించి ప్రశ్నలే వినిపించాయి. ఆయన సురక్షితంగా ఉన్నారా? ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? అని ఫ్యాన్స్ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే అభిమానుల చింతను అర్థం చేసుకున్న డైరెక్టర్ మారుతీ వెంటనే స్పష్టత ఇచ్చారు. ప్రభాస్ పూర్తిగా సేఫ్‌గా ఉన్నారని, ఆయన ఉన్న ప్రాంతం భూకంప ప్రభావం నుండి దూరంగా ఉందని తెలిపారు. టీమ్ మొత్తం క్షేమంగానే ఉందని మారుతీ చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. జపాన్‌లోని పరిస్థితులను స్థానిక ప్రభుత్వం పర్యవేక్షిస్తుండగా, ప్రమోషన్ షెడ్యూల్‌లో పెద్దగా మార్పులేమీ లేవని సమాచారం.
ప్రభాస్ అక్కడ అభిమానులతో, మీడియాతో ప్లాన్డ్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉన్నారని తెలుస్తోంది. పెద్ద ప్రమాదం తప్పిన నేపథ్యంలో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిలీఫ్ మెసేజ్‌లు, ప్రార్థనలు షేర్ చేస్తున్నారు. మొత్తం మీద, భూకంపం చోటు చేసుకున్నా ప్రభాస్‌కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టమైంది.
Also Read:చలిపులి..సింగిల్ డిజిట్‌కి ఉష్ణోగ్రతలు

