టీడీపీని వీడనున్న రేవంత్ రెడ్డి?

256
Revanth Reddy Over Formation Of New Party..!
- Advertisement -

టీటీడీపీకి మరో షాక్ తగలనుందా..? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారనున్నారా..? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలోని సీనియర్ లీడర్లంతా ఎవరిదారి వారు చూసుకోవడంతో టీటీడీపీని ఇప్పటివరకు అన్ని తానై నడిపించుకుంటు వచ్చిన రేవంత్ తనదారి తాను చూసుకోవడానికి రెడీ అవుతున్నాడట. 2019 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి టీడీపీ ని వదిలిపెట్టడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే, రేవంత్ ఏ పార్టీలో చేరుతారు అన్నదానిపై రకరకాల ఉహగానాలు వినిపిస్తున్నాయి. కొంతమంది త్వరలో కొత్త పార్టీ పెడుతున్నారని అంటుండగా మరొకొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వాదిస్తున్నారు.  తెలంగాణలో బలమైన సామాజిక  వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి యువకుడిగా, సమస్యల పట్ల అవగాహన ఉన్న నేతగా పేరు ఉండడంతో పాటుగా మంచి వాగ్థాటి గల నేత కూడా కావడంతో కొంత మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ పార్టీలోకి రేవంత్ ను ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం పై రేవంత్ అంతగా ఆశక్తి చూపడం లేదని సమాచారం.

మరోవైపు దక్షిణాదిన వైపు కన్నేసిన  బీజేపీ అగ్ర నేతలు కూడా రేవంత్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ అధినేతకు కూడా బీజేపీతో  సత్సబంధాలు ఉండడంతో బీజేపీ లోకి వెళ్లడమే బెటర్ అని రేవంత్ అనుచరులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రేవంత్ మాత్రం ఈ ఉహాగానాలపై ఇంతవరకు స్పందించలేదు.

అయితే, ఆయన సన్నిహితులు మాత్రం ఏకంగా రేవంత్ కొత్తపార్టీ పెడతారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు సాగిస్తూ…సొంతంగా అనుచరగణాన్ని సమీకరించుకుంటున్నారని టీ టీడీపీ వర్గాలు సైతం చర్చించుకుంటున్నాయి.

- Advertisement -