రేవంత్ రెడ్డి సి‌ఎం..చిక్కులు తప్పవా?

63
- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇక ప్రభుత్వ ఏర్పాటులో శరవేగంగా ముందుకు కదులుతోంది. ముఖ్యంగా సి‌ఎం అభ్యర్థి విషయంలో మొదటి నుంచి ఆ పార్టీలో కన్ఫ్యూజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు అరడజన్ మంది కాంగ్రెస్ నేతలు సి‌ఎం అభ్యర్థి రేస్ లో నిలుస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇలా కొంతమంది సి‌ఎం అభ్యర్థిగా ఉండేందుకు తెగ ఆసక్తి చూపించారు. అందుకే అధిష్టానం కూడా వ్యూహాత్మకంగా ఎన్నికల ముందు సి‌ఎం అభ్యర్థిని ప్రకటించకుండా హోల్డ్ లో ఉంచింది. ఇక ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రస్తుతం ఉన్న అరడజన్ మంది నేతల్లో సి‌ఎం పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ జోరుగా సాగుతూ వచ్చింది. అయితే హస్తం పార్టీ విజయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక పాత్ర వహించారని,అందుకే ఆయనకే సి‌ఎం పదవి కట్టబెట్టేందుకు అధిష్టానం మొగ్గు చూపింది. .

దీంతో సి‌ఎం రేస్ లో ఉన్న మిగతా నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అందరి సమ్మతితోనే రేవంత్ రెడ్డిని సి‌ఎం ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా రేవంత్ రెడ్డి సి‌ఎం కావడంతో టీపీసీసీ పదవి ఎవరిని వరిస్తుందనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది. టీపీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వంటి వారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అంతే కాకుండా గతంలో టీపీసీసీ చీఫ్ గా పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఈసారి మళ్ళీ టీపీసీసీ చీఫ్ రేస్ లో ఉండే అవకాశం ఉంది. అలాగే సీతక్క, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్, వంటి వారు కూడా టీపీసీసీ పదవి కోసం పోటీ పడే అవకాశం లేకపోలేదు. మరి హస్తం పార్టీలో సి‌ఎం పదవి కోసం సాగిన కూర్చిలాట.. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ పదవి వైపుగా మళ్ళింది. ఎటొచ్చీ పదవుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కు చిక్కులు తప్పెలాలేవు.

Also Read:కాంగ్రెస్ ‘ కే‌టి‌ఆర్ ‘ స్థానాన్ని భర్తీ చేయగలదా?

- Advertisement -