తెలంగాణ ద్రోహి..బాబు బానిస..!

24
revanth

తెలంగాణ ద్రోహి టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తూ..తెలంగాణ ఉద్యమంపై అడుగడుగునా విషం కక్కుతూ…రాష్ట్రం రాకుండా అడ్డుపడి తన గురువుతో పాటు ఎందరో బిడ్డల ఆత్మబలిదానాలకు కారకుడైన ప్రస్తుత టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు అమరవీరుల ఆత్మబలిదానాలు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. . తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఓ బలిదేవత, ఆమెకు గుడి కాదు సమాధి కట్టాలంటూ నోరుపారేసుకున్న ఈ దురంహకారిని ఇప్పుడు అదే సోనియా నెత్తిన పెట్టుకుని పీసీసీ కిరీటం పెట్టిన వైనం చూస్తే ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి ఇంతగా దిగజారాలా…ఇదేం రాజకీయం అంటూ తెలంగాణ ప్రజలు నోరెళ్లపెడుతున్నరు. టీడీపీలో ఉన్నంత కాలం తెలంగాణ రాకుండా అడ్డుపడిన చంద్రబాబు చెప్పులు మోసి బతికిన ఈ బానిస..ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై తుపాకీ ఎక్కుపెట్టిన వైనాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. ఇప్పుడు జంగ్ , బొంగ్ సైరన్‌లు అంటూ యువతా కదలిరా…మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తా… లాఠీ తగిలినా… తూటా తగిలినా ముందు తనకే తగులుతుందంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నడు.

అయితే రేవంత్ రెడ్డి కుటిల రాజకీయంపై సోషల్ మీడియాలో నెట్‌జన్లు ఆడేసుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి పాత వీడియోలు సోషల్ మీడియాలో నెట్టింట మళ్లీ హల్‌చల్ చేస్తున్నాయి. 2011లో కరీంనగర్‌లో జరిగిన టీడీపీ రణభేరి సభకు రేవంత్ రెడ్డి తుపాకీ వెంటబటెట్టుకుని వెళ్లడం అప్పట్లో కలకలం రేపింది. నాడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు మెప్పుకోసం ఆంధ్రోళ్ల పాట పాడాడు. రణ భేరీ సభను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకుంటారని భావించిన రేవంత్ సభకు వెళ్లూ గన్‌మెన్ల దగ్గర ఉన్న పెద్ద తుపాకీ పట్టుకుని కారెక్కాడు. అంతే కాదు నాడు తెలంగాణ కోసం కదం తొక్కిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఊ అంటే గన్‌ పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద పేద్ద తెలంగాణ ఉద్యమకారుడిగా డైలాగులు కొడుతూ యువతను మభ్యపెడుతున్నాడు.

తన గురువు చంద్రబాబుతో పాటు చివరినిమిషం వరకు తెలంగాణ రాకుండా కుట్రలు చేసి, ఎందరో యువకుల బలిదానాలకు కారకుడైన రేవంత్ రెడ్డి ఇప్పుడు మలి తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి విగ్రహానికి దండేసి దండం పెడుతుంటే తెలంగాణ సమాజం నివ్వెరపోతుంది. కాంగ్రెస్ పార్టీ ముసుగులో మళ్లీ రాష్ట్రాన్ని చంద్రబాబు కాళ్ల ముందు పడేసేందుకు కుట్రలు చేస్తున్న రేవంత్‌రెడ్డిని నమ్మితే కేసీఆర్ పాలనలో చల్లగా ఉన్న మన బతుకులను మనమే బుగ్గి పాల్జేసుకున్నట్లు అవుతుంది. తెలంగాణకు ఇప్పటికీ, ఎప్పటికీ కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష..బండి సంజయ్, రేవంత్ రెడ్డి వంటి బానిసల చేతిలో తెలంగాణను పెడితే మళ్లీ అరిగోస పడాల్సిందే. ప్రజలారా జాగో…రేవంత్ హఠావో..తెలంగాణ బచావో..!