శృంగేరి పీఠంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”..

22

జమ్మి మొక్క” మొక్కల యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అద్భుతంగా ముందుకు సాగుతుంది. కాలాల్ని, సంస్కృతుల్ని, పండగల్ని తనలో మిలితం చేసుకొని కొత్త ఆలోచనలతో ప్రకృతి ప్రేమికులను కదలిస్తుంది. అందులో భాగంగానే నిర్వాహకులు. “ఊరి ఊరికో జమ్మిచెట్టు – గుడి గుడికో జమ్మి చెట్టు” నాటే మహాసంకల్పాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా, ఇవ్వలా శృంగేరిలోని శ్రీ.శ్రీ.శ్రీ. జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షినామ్నాయ శ్రీ శారద పీఠంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.

చెట్ల యొక్క ఔన్నత్యాన్ని చాటేలా, భారతీయ సంస్కృతిలో చెట్ల ప్రాముఖ్యతను తెలిపేలా ముద్రించిన “వృక్షవేదం” పుస్తకాన్ని మరియు జమ్మి మొక్కను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రతినిధి మఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామీజీకి అందజేశారు.

అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం మహోన్నతమైనది. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని కాపాడాలనే వారి ఆలోచన అద్భుతమైనది. అందులోనూ హిందూ సంప్రదాయంలో, రామాయణంలో, మహాభారతంతో పాటు అనేక పురాణాల్లో విశేష ప్రాధాన్యత కలిగి.. అంతరించిపోతున్న జమ్మి మొక్కను నాటాలనే వారి అభినివేశానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. వారి కృషికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వారిని సహృదయంతో ఆశ్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం, మఠంలో జమ్మి మొక్కను నాటిన సీఈఓ పద్మశ్రీ గురుసేవ దురిన మరియు డాక్టర్ వి.ఆర్.గౌరీ శంకర్, మఠం సాధువులు, పూజారులు, ఇతర భక్తులతో కలిసి జమ్మి మొక్కను నాటారు.

అనంతరం, పద్మశ్రీ గురుసేవ దురిన మాట్లాడుతూ.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమాన్ని ఆకుంఠీత దీక్షతో ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. వారి భవిష్యత్ కార్యక్రమాలు దిగ్విజయం కావాలని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బాధ్యులు కర్ణాకర్ రెడ్డి, రాఘవతో పాటు మఠం బాధ్యులు, సాధువులు, ఇతర భక్తులు పాల్గొన్నారు.