టి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు జోరందుకున్నాయి. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని కచ్చితంగా ప్రకటించనప్పటికీ అయన కదలికలు గమనిస్తే అలాగే అనిపించింది. ఏపీ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం, ఢిల్లీలో గత కొన్ని రోజులుగా మకాం వేసి కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో రేవంత్ చేరిక ఖాయమని అంతా భావించారు. అయితే రేవంత్ రెడ్డి పార్టీ మారడానికి ముందే ఆయన అనుచరులు ఆయనకు గట్టి షాక్ ఇచ్చారు. పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేరబోతున్నారు.
రేవంత్ ప్రధాన అనుచరుడు బాలుసింగ్ నాయక్ సహా కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు మరికొద్ది సేపట్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కారెక్కనున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డికి ఈ ఊహించని పరిణామం షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. ఆయన వెంట నడవాల్సిన అనుచరులు మూకుమ్మడిగా టీడీపీ పార్టీని వీడి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతుండడంతో రేవంత్ రెడ్డి కాస్త అయోమయంలో ఉన్నాడనే చెప్పాలి.