మోత్కుపల్లి ప్రశ్నకు.. రేవంత్‌రెడ్డి మౌనం..

282
- Advertisement -

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్త రెండు రోజులుగా తెలంగాణలో హల్‌చల్ చేస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో ఈ మేరకు ఆయన సమావేశమైనట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో రేవంత్‌ నుంచి ఎటువంటి స్పందన లేదు. అంతేకాదు ఈ రోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో, సెంట్రల్‌ కమిటీ సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. సమావేశంలో రేవంత్‌రెడ్డి అంశమే ప్రధానంగా చర్చించారు. రేవంత్ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలు నిలదీశారు. కాంగ్రెస్‌ నేతలను ఎందుకు కలిశారో చెప్పాలని మోత్కుపల్లి, అరవింద్‌కుమార్‌ రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. అయితే వారి ప్రశ్నకు రేవంత్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. అధినేత అనుమతి లేకుండా కాంగ్రెస్‌ నేతలతో చర్చలు జరపడాన్ని మోత్కుపల్లి తప్పుబట్టారు.

War of Words Between Revanth Reddy and Motkupalli
పరిటాల సునీత, యనమలపై వ్యాఖ్యలను మోత్కుపల్లి ఖండించారు. చంద్రబాబుకు తెలియకుండా పొత్తుల చర్చలు జరిపే హక్కు ఎవరిచ్చారని మోత్కుపల్లి రేవంత్‌రెడ్డిని నిలదీశారు. అన్ని విషయాలు చంద్రబాబుకు వివరిస్తానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సమాధానంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కలిసే అవకాశముంది. కాగా, కాంగ్రెస్‌లో చేరేందుకు రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కి రాకముందే ఆయన ప్రధాన అనుచరుడు సైలెంట్‌గా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనుండడం రేవంత్‌కు భారీ షాకేనని చెబుతున్నారు.

- Advertisement -