ఓటుకు నోటు కేసును ప్రజలు ఇప్పటికి మర్చిపోలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. సీటుకు నోటు కుంభకోణంలో రేవంత్ పాత్ర ఉందని స్పష్టమైందన్నారు. యంగ్ ఇండియన్ కేసులో ఈడీ ఛార్జీషీట్‌లో రేవంత్ పేరును ప్రస్తావించిందన్నారు. నాడు పీసీసీ పదవి కోసం రూ.50 కోట్లు ఇవ్వగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందన్నారు. కాంగ్రెస్‌కు డబ్బులు అవసరమైనప్పుడల్లా ఇస్తూ సీఎం పదవిని కాపాడుకుంటున్నారన్నారు.
యావత్ దేశం ముందు తెలంగాణ పరువును తీసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం ఐనా రేవంత్ రెడ్డి బుద్ది మారలేదన్నారు. 2021లో సీఎంగా యడీయూరప్ప ఉన్నప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్‌లో నాయకులు ఆయన్ని రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారన్నారు. సీఎంగా యడీయూరప్ప ఉంటే విచారణ నిష్పక్షపాతంగా జరగదని తెలిపారన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు ముటల ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పత్రికలకు డబ్బులు అందించారని ఈడీనే స్వయంగా చెబుతుందన్నారు. రేవంత్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి చీకట్లో బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారన్నారు. చీకట్లో రేవంత్ అమిత్ షా కాళ్లుపట్టుకుని బయటికి వచ్చి ఫోజులు కొడుతున్నారన్నారు.
ఒక్క గ్యారెంటీ అమలు చేయకుండా లక్షా 80 వేల కోట్లు అప్పు చేశారన్నారు. ఈ సంపద అంతా ఢిల్లీ కాంగ్రెస్‌కు అందచేస్తున్నారన్నారు. రేవంత్‌కు ఢిల్లీలో ఇద్దరు బాస్‌లు ఉన్నారని ఒకరేమో కాంగ్రెస్ అయితే ఇంకొకరూ బీజేపీ అన్నారు. బీఆర్ఎస్‌పై నిందలు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాస్‌లకు వేల కోట్ల చందాలు తప్ప రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరును ఈడీ ఛార్జీషీట్‌లో చేర్చితే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు. రేవంత్ జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడే అనుమానం వచ్చిందన్నారు. అదే సమయంలో ఢిల్లీలో ఈ కేసులో సోనియా, రాహుల్‌ను చేర్చితే ఎందుకు స్పందించలేదో ఇప్పుడు అర్ధమైందన్నారు.
Also Read:తమన్నాపై కర్ణాటక ఎంపీ ఫైర్

