తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్‌: కేటీఆర్

11
- Advertisement -

తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్…తెలంగాణకు పట్టిన దయ్యం కాంగ్రెస్ అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం ఉందని కాబట్టే నేతలు లేఖ రాస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుంటేనే మంచిదన్నారు. ఇది అందరూ నేతలకు వర్తిస్తుందన్నారు. కర్ణాటకలో వాల్మీకి కుంభకోణంలో రూ.45 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వచ్చాయని ఈడీ స్వయంగా పేర్కొన్న ఇంతవరకు చర్యలు లేవన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…మంత్రి పొంగులేటి ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగితే ఇంతవరకు చర్యలేవి చెప్పాలన్నారు. ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

సివిల్ సప్లై స్కాం, యంగ్ ఇండియన్ కేసులో బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. హెచ్‌సీయూ భూముల విషయంలో ఏజెన్సీలు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో అర్ధం చేసుకోవాలన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్‌ పై ప్రధాని స్వయంగా ఆరోపణలు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. రేవంత్‌పై చర్యలకు కేంద్రం ముందుకు రావాలని… నెల రోజులు ఎదురు చూస్తామని తెలిపారు.

గవర్నర్‌ను కలిసి సీఎం రేవంత్ చేసిన తప్పులను వివరిస్తామన్నారు. బీజేపీ ఇప్పటివరకు రేవంత్‌ను రక్షణ కవచంలా కాపాడుతోందన్నారు. దీనిపై పార్టీలో చర్చించి పోరాట కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. కాళేశ్వరం అద్భుతమని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. రేవంత్‌కు పిల్లనిచ్చిన మామే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగడం లేదని చెప్పారన్నారు.

Also Read:KTR:రేవంత్ రాజీనామా చేయాల్సిందే

- Advertisement -