తుస్సుమన్న రేవంత్…

311
Revanth is isolated
- Advertisement -

అంతా అనుకున్నట్లే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వ‌చ్చేశారు. రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో ఆయ‌న అధికారికంగా పార్టీలో చేరిపోవ‌డం, ఆయ‌న‌తోపాటు కొంత‌మంది టీడీపీ నేత‌లు కూడా పార్టీ కండువాలు క‌ప్పుకోవ‌డం.. అన్నీ జ‌రిగిపోయాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ నాయ‌కుడిగా రేవంత్ రెడ్డి క‌ర్త‌వ్యం ఏంటి..? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరి నెల రోజులు కావొస్తున్న ఆయన నుంచి ఇప్పటివరకు ఎలాంటి చలనం లేదు. రేవంత్ దూకుడు వ్యవహారంతో పాటు కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ రాకను వ్యతిరేకిస్తుండటమే దీనికి కారణమని పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు. దీనికి తోడు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ కాంగ్రెస్‌పై ఘూటు విమర్శలు చేశారు. దీనినే ప్రస్తావిస్తున్న కొంతమంది సీనియర్లు…రేవంత్ విషయంలో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. ఇదే విషయాన్ని హైకమాండ్‌ దగ్గర కూడా ప్రస్తావించేందుకు సిద్దంగా ఉన్నారట.

Revanth is isolated

మరోవైపు రేవంత్‌కు ఆయన అనుచరులు గట్టి షాకిస్తున్నారు. ఇప్పటికే కొడంగల్‌లో రేవంత్ అనుచరులతో పాటు టీడీపీ క్యాడర్ అంతా ఖాళీ అయింది. దీనికి తోడు తనతో పాటు కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరిగిన నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల భూపాల్ రెడ్డి, భూపాలపల్లికి చెందిన గండ్ర సత్యనారాయణ,జనగామకు చెందిన మధుసుదన్ రెడ్డి కారెక్కారు. ఇక వీరిబాటలోనే మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి ఉన్నట్లు సమాచారం.

దీనికి తోడు రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారంపై జోరుగా చర్చ సాగుతోంది. రాజీనామాపై ఆయన చిత్తశుద్ధితో ఉన్నారా అనే చర్చ సాగుతోంది. తాను రాజీనామా చేశానని రేవంత్ ప్రకటించిన ఆ రాజీనామా పత్రం ఎక్కడి వరకు వచ్చింది? ఎప్పుడు కదలిక వస్తుంది? ఎప్పుడు అమోదం పొందుతుందన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఇక రేవంత్ రాజీనామాపై టీటీడీపీ నేతలే విమర్శలు గుప్పిస్తుండటంతో ఆయన మరింత చిక్కుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలోనే రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది రేవంత్ పరిస్ధితి.

- Advertisement -