లైఫ్ స్టైల్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మిసమిసలాడే సుందరి మీనాక్షి దీక్షిత్. ఆ తర్వాత దూకుడు, బాద్ షా చిత్రాల్లో ఐటం సాంగులు చేసి ఆకట్టుకుంది. వెంకీ బాడీగార్డ్, రవితేజ దరువు చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసింది. తెలుగులో చివరగా ‘అడవి కాచిన వెన్నెల’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ తెగ ప్రయత్నాలు చేసిన ఈ బ్యూటీలో బాలీవుడ్‌కి చేరుకుంది.

బాలీవుడ్‌లో అవకాశాలను దక్కించుకునేందుకు అందాల మోత మోగించేందుకు సిద్దమవుతోంది. అందాల ప్రదర్శనలో ఒక్క హీరోయిన్‌ది ఒక్కోదారి. అయితే రీసెంట్‌గా మీనాక్షి పంచిన అందాల డోస్‌తో అందరి మతిపోయింది. క్లీవేజ్ డోస్ లో కొత్త స్పెల్లింగులు రాసేందుకు ట్రై చేస్తోందా అనేలా అందాలను ప్రదర్శించింది.
గతేడాది రణదీప్ హుడాకి జోడీగా లాల్ రంగ్ మూవీలో నటించిన తర్వాత.. మళ్లీ బాలీవుడ్ ఆఫర్ ఏమీ దక్కలేదు. ఉత్తరాదికి చెక్కేసిందనే ఫీలింగ్ తో సౌత్ నుంచి కూడా ఆఫర్స్ ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో తన కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అందరు హీరోయిన్ల బాటలోనే అందాల డోస్‌ను నమ్ముకుంది. మరి ఈ అమ్మడికి ఈ క్లీవెజ్‌తో షోతోనైనా అవకాశాలు కలిసివస్తాయో లేదో వేచిచూడాలి.

