మొక్కలు నాటిన రిటైర్డ్ జస్టిస్‌…

22
- Advertisement -

బీఆర్ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించబడిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు విశేష స్పందన వస్తోంది. తాజాగా రిటైర్డ్‌ జస్టీస్ నరసింహారెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. అడ్వకేట్స్ హరనాథ్‌రావు మరియు వారి సతీమణి శ్రీదేవి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని ఈ రోజు తమ నివాసంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ సంరక్షణకు సమతుల్యతకు మొక్కలు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటే బాధ్యత చేపట్టాలని కోరారు. తన ఫామ్ హౌస్లో వివిధ రకాల మొక్కలను సంరక్షిస్తున్నాము అని గ్రీనరి అంటే ఎంతో ఇష్టమన్నారు. ఇంటి చుట్టూ కూడా వివిధ రకాల పండ్ల, పూల మొక్కలు మరియు అరుదుగా కనపడే చాలా మొక్కలను కాపాడుతున్నామని అన్నారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మొక్కలు పెట్టే కార్యక్రమాన్ని చేపట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -