బుల్లితెరపై ఓ రేంజ్‌లో అందాల విందు చేసిన రష్మి, వెండితెర రీ ఎంట్రీ అవకాశం వచ్చేపాటికి చెలరేగిపోయింది. ”గుంటూరు టాకీస్’లో రష్మి పరచిన అందాల విందు చూసి సినీ జనాలే అవాక్కయ్యారు. అలాగే మరికొన్ని చిత్రాలలో అదే స్థాయి సౌందర్యాలను బహిరంగపరిచడంతో ఒకానొక స్థాయిలో రష్మి అందాల ప్రదర్శన హాట్ టాపిక్ అయ్యింది.
తాజాగా ఈ భామకు టాలీవుడ్ డైరెక్టర్ మారుతి నుండి రష్మికి ఆఫర్ వచ్చిందని టాక్. మారుతి ఇండస్ట్రీ పరిచయం కూడా అడల్ట్ సినిమాలతో జరిగిందన్న సంగతి తెలిసిందే. నానితో భలే భలే మొగాడివోయ్, వెంకీతో బాబు బంగారం సినిమాల తరువాత మరో్సారి మారుతి నిర్మాణ సారథ్యంలో రష్మి ప్రధాన పాత్రగా ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మారుతికి బాగా అచ్చి వచ్చిన బోల్డ్ కంటెంట్ ఎక్కువగానే ఉండబోతుందని, ఈ సినిమా రష్మికి మాంచి బ్రేక్ ఇవ్వనుందని ఇండస్ట్రీ టాక్. సాధారణంగా చిన్న చిన్న సినిమాలు నిర్మించే మారుతి ప్రాజెక్టుల్లో దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి అగ్ర నిర్మాతలు పెట్టుబడులు పెడుతుంటారని, ఈ సినిమా కూడా అలాగే నిర్మాణం కానుందని సమాచారం. గుంటూర్ టాకీస్‌తో ఎంట్రీ గ్రాండ్‌గానే ఇచ్చినా రష్మికి మాత్రం సరైన్ బ్రేక్ రాలేదనే చెప్పుకోవాలి. మారుతి ఐనా రష్మికి బ్రేక్ ఇస్తాడో లేలో చూడాలి.