2 వేల నోటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం..

203
rbi
- Advertisement -

బ్లాక్ మనీ వెలికితీతలో భాగంగా భారత ప్రభుత్వం పాతనోట్లను రద్దుచేసి వాటి స్ధానంలో కొత్త నోట్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 2 వేల నోటును తీసుకురాగా ఇప్పటివరకు క్రమక్రమంగా 2 వేల నోటు ముద్రణను నిలిపివేసింది.

అయితే తాజాగా 2 వేల నోటుపై కీలక ప్రకటన చేసింది ఆర్బీఐ. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండువేల రూపాయల నోట్లను ముద్రించబోమని తెలిపింది. భారత్‌లో 500 నోట్లు, 2వేల నోట్లు.. ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న నోట్లలో అత్యధిక కరెన్సీ విలువను కలిగి ఉన్నాయి.

2018 నుంచి వ్యవస్థలో 2వేల కరెన్సీ నోట్లు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఆర్‌బీఐ రెండువేల నోటును రద్దు చేయకుండా క్రమ క్రమంగా ముద్రణను నిలిపివేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -