మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

453
Finance Approval for 113 posts in different departments in Telangana
- Advertisement -

కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లను ప్రకటించారు రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి . 13 నగరపాలక సంస్థల్లో ఎస్టీ-1, ఎస్సీ-1, బీసీ-4, జనరల్‌-7 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్మన్లలో ఎస్టీ-4, ఎస్సీ-17, బీసీ-40, జనరల్‌ -62 స్థానాలను కేటాయించినట్లు ఆమె తెలిపారు. మీర్‌పేట్‌ మేయర్‌ పదవి ఎస్టీకి కేటాయించగా, రామగుండం మేయర్‌ పదవి ఎస్సీకి కేటాయించారు. జవహర్‌నగర్‌, బండ్లగూడ, నిజామాబాద్‌ నగరపాలక సంస్థ మేయర్‌ పదవులను బీసీకి కేటాయించినట్లు ఆమె తెలిపారు. జీహెచ్ఎంసీ మేయర్ ఓపెన్ కేటగిరికి కేటాయించారు. ఎస్టీ రిజర్వేషన్ మొత్తం జనాభా పై ఆధారపడి ఉంటుందన్నారు పురపాలక సంచాలకులు శ్రీదేవి. బిసిలో మాత్రం జనాభా కాకుండా బిసి ఓటర్లను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. 128 మున్సిపాలిటీలో జడ్చర్ల, నకిరేకల్ కు సమయం ఉంది. పాల్వంచ, మందమర్రి, మణుగూరుకు రిజర్వేషన్ ప్రకటించడం లేదన్నారు.

St రిజర్వుడ్ మున్సిపాలిటీలు..
అమన్గల్, వర్ధన్నపేట, దోర్నాల్, మరిపెడ, డోర్నకల్.

Sc రిజర్వుడ్ మున్సిపాలిటీలుః
కేతనపల్లి, బెల్లంపల్లి, మధిర, పరకాల, వైరా, నస్కురు, అలంపూర్, తోర్రుర్, నార్సింగి, పెద్ద అంబర్ పేట, ఐజా, పెబ్బేరు, నెరుడుచెర్ల, వడ్డేపల్లి, భూపాలపల్లి, తిరుమలగిరి
Bc రిజర్వుడ్ మున్సిపాలిటీలుః
సిరిసిల్ల, నారాయణ పేట, కోరుట్ల, చండూరు, భీంగల్, ఆందోల్, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, నిర్మల్, కిసిగి, రాయికల్, పోచంపల్లి, రమాయపేట, బోధన్, సదాశివ పేట, ఆర్ముర్, మెటపల్లి, గద్వాల్, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, సుల్తానాబాద్, నర్సంపేట, కిదంగల్, తుఫ్రాన్, ఆలేరు, భువనగిరి

- Advertisement -