కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

6
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌పై 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లేయన్ హాజరై భారతదేశానికి తమ శుభాకాంక్షలు తెలిపారు. వారి హాజరు భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య పెరుగుతున్న దౌత్య సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను ‘వందేమాతరం’ అనే థీమ్‌తో నిర్వహించారు. దేశభక్తి, ఐక్యత, త్యాగాలను ప్రతిబింబించేలా పరేడ్ సాగింది. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనకు చెందిన మొత్తం 6,050 మంది సైనికులు క్రమబద్ధంగా పరేడ్‌లో పాల్గొని తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించారు.

కర్తవ్య పథ్ అంతటా జాతీయ పతాకాలు, సాంస్కృతిక అలంకరణలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు భారతదేశంలోని వైవిధ్యం, సంస్కృతి, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించాయి. సైనికుల క్రమశిక్షణ, బ్యాండ్ల సంగీతం ప్రేక్షకులను దేశభక్తి భావాలతో ఉర్రూతలూగించింది.

పరేడ్ సందర్భంగా భారత సైనిక శక్తిని చాటే ఆధునిక ఆయుధాలు, రక్షణ పరికరాలు ప్రదర్శించబడాయి. అలాగే దేశ నిర్మాణంలో యువత పాత్ర, మహిళల శక్తి ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Also Read:ఆగస్టు 15..రిపబ్లిక్ డేకి తేడా ఇదే

గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత ప్రజాస్వామ్య బలాన్ని, రాజ్యాంగ విలువలను మరోసారి ప్రపంచానికి చాటాయి. కర్తవ్య పథ్‌పై జరిగిన ఈ వేడుకలు దేశమంతా గర్వం, ఉత్సాహాన్ని నింపాయి.

- Advertisement -