ఇరాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, భద్రతా పరిస్థితులు తీవ్రంగా మారిన నేపథ్యంలో ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ, ఇరాన్‌కు వెళ్లే కొన్ని అంతర్జాతీయ విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.
ఈ నిర్ణయంలో భాగంగా ఢిల్లీ–టీబీలీసీ (టిబ్లిసి) మధ్య, అలాగే ముంబై–అల్మట్టి మధ్య నడిచే విమాన రాకపోకలను రద్దు చేసినట్లు తెలిపింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ విమానాలు తిరిగి ప్రారంభించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రయాణికులు ముందుగా తమ ఫ్లైట్ స్టేటస్‌ను చెక్ చేసుకుని, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
ఇండిగో విడుదల చేసిన ట్రావెల్ అడ్వైజరీలో, ఇరాన్ పరిసర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో విమానాల నిర్వహణపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లేదా రీషెడ్యూల్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఇరాన్‌లో కొనసాగుతున్న రాజకీయ, సామాజిక నిరసనల కారణంగా అంతర్జాతీయ విమానయానంపై ప్రభావం పడుతుండటంతో, ఇతర ఎయిర్‌లైన్స్ కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రయాణికులు అధికారిక ప్రకటనలను అనుసరిస్తూ అప్రమత్తంగా ఉండాలని విమానయాన నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

