రేపట్నుంచి ఒంటిపూట స్కూళ్లు…

16
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు రేపటి నుంచి ఒంటిపూట బడుల నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15నుంచి ఏప్రిల్ 24వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకే పాఠశాలలు నిర్వహించాలిన పేర్కొంది. విద్యార్థులకు 12.30గంటల కల్లా మధ్యాహ్న భోజనం పెట్టాలని కూడా సూచించారు. పదవ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగించాలని ఆదేశాల్లో తెలిపింది.

పదవ తరగతి పరీక్షలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.00 గంటల నుంచి సాయంత్రం 5.00వరకు కొనసాగించాలని పేర్కొంది. అవసరమైన చోట ప్రైవేటు పాఠశాలను తనిఖీ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులను పక్కగా అమలు చేయాలని సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల రీజనల్ జాయింట్ డైరెక్టర్స్‌ ఆఫ్ స్కూల్‌ ఎడ్యూకేషన్‌, డిస్ట్రిక్ ఎడ్యూకేషనల్‌ ఆఫీసర్స్‌కు తెలిపింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఉత్తర్వులో సూచించారు.

ఇవి కూడా చదవండి…

ఏపీలో నవరత్నాల పాలన..

రాష్ట్రానికి వర్ష సూచన..

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం…

- Advertisement -