ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి..

55
renuka
- Advertisement -

రాజ్‌భ‌వ‌న్ వ‌ద్ద ఉద్రిక్తత నెలకొంది. టీ కాంగ్రెస్ నేత‌లు రాజ్‌భ‌వ‌న్ వ‌ద్ద వీరంగం సృష్టించారు. పోలీసుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. అయితే హైదరాబాద్‌లో కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం రసాభాసగా మారింది.

ఈ సందర్భంగా తనను అడ్డుకోబోయిన పోలీసులపై కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి అనుచితంగా ప్రవర్తించారు. పంజాగుట్ట ఎస్సై కాలర్ ఆమె పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను అక్కడి నుంచి పోలీసు వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు రేణుక వార్నింగ్ ఇచ్చారు. మీ స్టేషన్ కు వచ్చి మిమ్మల్ని కొడతానంటూ హెచ్చరించారు.

- Advertisement -