గెలిచింది ఈటల…బీజేపీ కాదు: రేణుకా

87
renuka
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచింది బీజేపీ కాదు…ఈటల రాజేందర్ అని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి. రాజకీయాల్లో… గెలుపు.. ఓటములు సహజమని…. కోమటి రెడ్డి వ్యాఖ్యలు సరైనవే…కానీ బయట మాట్లాడకుండా ఉండాలన్నారు.

పార్టీ వ్యవహారాలు పార్టీ వేదికపై మాట్లాడాలని బహిరంగంగా మాట్లాడితే పార్టీకే నష్టమని తెలిపారు. హుజురాబాద్‌ లో అసలు బీజేపీ లేనే లేదని… అక్కడి గెలుపు ఈటెల రాజేందర్‌ ది అని స్పష్టం చేశారు. ఆ గెలుపు.. బీజేపీ కాదన్నారు. అక్కడ బీజేపీ ఎక్కడ ఉందని… ఈటల కోసం స్థానిక నాయకులు కూడా పనిచేశారని తెలిపారు. ఫలితాలపై సమీక్ష చేసుకుంటామని తెలిపారు రేణుకా.

- Advertisement -