నటిగా రీ ఎంట్రీ ఇవ్వనున్న రేణు దేశాయ్..

189
Renu Desai

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణ దేశాయ్ నటిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటిచింది. చాలా ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు రావడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. వచ్చే నెలలో ఈ వెబ్ సిరీస్ ప్రారంభించబోతున్నట్టు రేణు ప్రకటించింది. ఇక రేణు దేశాయ్ చేయబోయే ఈ వెబ్ సిరీస్ న్యాయం కోసం పోరాడే ఓ యువతి కథ అని చెప్పుకొచ్చింది.

త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు చెప్తాను. స‌త్యాన్వేష‌ణ‌లో ఉన్న ఓ మ‌హిళ ప్ర‌యాణానికి మీ ఆశీస్సులు, ప్రేమ‌ను అందించాల‌ని కోరుకుంటున్నా’అని రేణూ ఇన్‌స్టా పోస్టులో వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్‌ను సాయికృష్ణ ప్రొడక్షన్స్ పై డీఎస్ రావు, ఎస్.రజినీకాంత్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఎం.ఆర్.కృష్ణ మామిడాల ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నట్టు రేణు చెప్పింది.