టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్..

204
Kings XI Punjab

ఐపీఎల్‌ 2020 13 సీజన్‌ సెకండ్‌ మ్యాచ్‌లో దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తలపడుతున్నాయి. పంజాబ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈసారి కొత్త కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో పంజాబ్‌ బరిలో దిగుతున్నది.

నలుగురు విదేశీ స్టార్లు మాక్స్‌వెల్‌, పూరన్‌, జోర్డాన్‌, కాట్రెల్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు రాహుల్‌ చెప్పాడు. తమ టీమ్‌లో అద్భుతమైన ఆటగాళ్లున్నారని, అత్యుత్తమ జట్టు కూర్పు కాస్త ఇబ్బందిగా మారిందని ఢిల్లీ సారథి శ్రేయాస్‌ అయ్యర్‌ అన్నాడు.హెట్‌మైర్‌, రబాడ, స్టాయినీస్‌, నోర్ట్జే ఓవర్‌సీస్‌ ప్లేయర్లను ఎంపిక చేసినట్లు వివరించాడు. 2020 సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని ఇరుజట్లు ఉత్సాహంగా ఉన్నాయి.