సినిమా ఛాన్స్ కోసం వారి కోరిక తీర్చాలి- కంగనా

181
Kangana

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ డార్క్ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా వెల్లడిస్తూ వస్తోంది. బాలీవుడ్‌లో లైంగిక వేధింపుల బారిన ప‌డిన వారిలో తాను కూడా ఉన్నాన‌ని కంగ‌నా కూడా చెప్పింది. బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ కశ్య‌ప్ త‌న‌పై లైంగిక దాడి చేశాడని న‌టి పాయ‌ల్ ఘోష్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా సంచలన విషయాలు బయట పెట్టింది.

బాలీవుడ్ లో చాలా పెద్ద హీరోలు త‌మ ప‌ట్ల లాకింగ్ వ్యాన్ లో కానీ రూంలో కానీ, పార్టీల్లో పాల్గొన్న‌పుడు కానీ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేవార‌ని, ప‌ని కోసం అపాయింట్ మెంట్ తీసుకుని ఇంటికి రావాల‌ని చెప్పి, బ‌ల‌వంతం చేసేవార‌ని ట్విట‌ర్ లో ట్వీట్ చేసింది. బాలీవుడ్ సెక్సువ‌ల్ ప్రీడేట‌ర్స్ ల‌తో నిండిపోయింది. వారివి ( బాలీవుడ్ హీరోలు, ప్ర‌ముఖులు) న‌కిలీ, డ‌మ్మీ పెళ్లిళ్లు. వారు సంతోషంగా ఉండేందుకు ప్ర‌తీ రోజు హాట్ గా ఉండే కొత్త యువ‌తిని ఆశిస్తుంటారు. స్టార్ హీరోయిన్ అయినా ఛాన్స్ కోసం ఆ సినిమాకి కీలక వ్యక్తులకు లైంగికంగా లొంగిపోయి తృప్తి పరచనిదే పనికాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది కంగనా.