కరోనా థర్డ్ వేవ్..జాగ్రత్తగా ఉండండి: రేణు

19
renu

కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. దేశంలో కేసుల సంఖ్య రోజుకు లక్షల్లో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. తాజాగా రేణూ దేశాయ్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. రేణూతో పాటు ఆమె తనయుడు అఖీరా నందన్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని రేణూ స్వయంగా వెల్లడించింది.

ఇంట్లోనే ఉన్నప్పటికీ తనకు, అఖీరాకు ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మేము ఇద్దరం ఇప్పుడు కోలుకుంటున్నామని వెల్లడించింది. కరోనా థర్డ్ వేవ్ ని సీరియస్ గా తీసుకోండి. మాస్కులు ధరించండి అని రిక్వెస్ట్ చేశారు రేణు. గత ఏడాదే రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించుకున్నాను. అఖీరాకు మాత్రం ఒకటే డోస్ అయ్యింది. రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించాల్సిన సమయంలోనే కరోనా పాజిటివ్ అని తేలింది అని వెల్లడించింది రేణు.