ఈ వారం ఓటీటీ సినిమాలివే..!

23
ott

కరోనా థర్డ్ వేవ్ విజృంభనతో సంక్రాంతి రేసు నుండి పలు పెద్ద సినిమాలు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటీటీ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓటీటీ సినిమాలకు గిరాకీ బారీగా పెరిగిపోయింది.

సంక్రాంతికి హాట్ స్టార్ లో సందడి చేయబోతుంది పెళ్లి సందడి. కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజై దానికి తగ్గ కలెక్షన్స్ రాబట్టింది. హాట్ స్టార్ స్పెషల్ గా హ్యూమన్ సిరీస్ ను తీసుకురాబోతుంది.

నెట్ ఫ్లిక్స్ లో జనవరి 13న ఇంగ్లీష్ మిస్టరీ బ్రజెన్ స్ట్రీమింగ్ కాబోతుంటే జనవరి 14న సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ ఆర్కివ్ 81తో పాటూ యే కాలీ కాలీ అంఖేన్ క్రైమ్ డ్రామా రిలీజ్ ఉంది. శ్వేతా త్రిపాఠి, తాహిర్ రాజ్ జంటగా నటించిన ఈ మూవీ హిందీతో పాటూ తెలుగు, తమిళ్ బాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. జీ5లో గరుడ గమన వృషభ వాహన సినిమాను.. జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు.