కరోనా…ఐసీయులో లతా మంగేష్కర్

22
latha

దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. రోజుకు లక్షల్లో కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా భారత రత్న అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 2019 నవంబర్ లో లతా మంగేష్కర్ వైరల్ చెస్ట్ కంజెస్టిన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం అనే కోలుకున్నారు.