- Advertisement -
‘పవర్ స్టార్ మాజీ సతీమణి’ రేణూ దేశాయ్ తాను రెండో పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఆ మధ్య తెగ హడావిడి చేస్తూ ఓ వ్యక్తితో కలిసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. కాకపోతే, ఆ ఫోటోలలో తనకు కాబోయే రెండో భర్త ఫేస్ ను దాచేసి, అతని ఫోటోను రేణు షేర్ చేసింది. ఆ ఫోటోలో అతడి చేతికి రేణూ దేశాయ్ రింగ్ కూడా తొడగడం ఇక్కడ విశేషం. కట్ చేస్తే.. ఈ వ్యవహారం జరిగి రెండేళ్లు అవుతుంది. రేణూ దేశాయ్ రెండో పెళ్లి పై మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా రేణు దేశాయ్ తన రెండో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ”నేను రెండో పెళ్లి చేసుకోవడానికి చాలా వెయిట్ చేస్తున్నాను. ఇక నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు కూడా ఇష్టమే. ఒక వ్యక్తి వల్ల నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావ్ అంటే.. హ్యాపీగా పెళ్లి చేసుకో మమ్మీ అని వాళ్లు నాతో తరుచూ అంటూ ఉంటారు. ఎవరికైనా ఒంటరి తనం చాలా బాధగా ఉంటుంది. ఈ క్రమంలోనే నాకు ఓ తోడు దొరికింది. తను నన్ను చాలా సంతోష పెడతాడు. అయితే ఇంకో రెండేళ్లలో నా పిల్లలు పెద్దవాళ్లు అవుతారు. ఆ తర్వాత అతనితో నా రెండో పెళ్లి కచ్చితంగా ఉంటుంది’ అని రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Also Read:CM KCR:కేసిఆర్ తో ఢీ కొట్టి నిలిచేరా?
ఐతే, తాను రెండో పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు ?, అతను ఏం చేస్తాడు ? లాంటి విషయాలను రేణు దేశాయ్ గతంలో ఓ టాక్ షోలో బయట పెట్టింది. తనకు కాబోయే భర్త ఓ ఐటీ కంపెనీ మేనేజర్ అని, గతంలో అమెరికాలో జాబ్ చేసేవాడని, తన తండ్రికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇండియాకు వచ్చి పూణేలో జాబ్ చేస్తున్నాడని రేణు చెప్పుకొచ్చింది. రవితేజ టైటిల్ రోల్ పోషించిన ‘టైగర్ నాగ్వేశ్వరరావు’ సినిమా విడుదలకు సిద్ధమైంది. చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ రీఎంట్రీ ఇవ్వడం ప్రత్యేకంగా నిలిచింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. రేణు దేశాయ్ ఒరిజినల్ కేరక్టర్ కి చాలా దగ్గరగా కనిపిస్తారని చెప్పారు. మరి సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
Also Read:నా విజయానికి కారణం సుకుమార్: బన్నీ
- Advertisement -