నా విజయానికి కారణం సుకుమార్: బన్నీ

41
- Advertisement -

హీరో అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడంపై ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇంతకీ బన్నీ ఏం ట్వీట్ చేశాడంటే.. ‘ఈ అవార్డు అందుకోవడం విశేషం. నాకు గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ముఖ్యంగా నా విజయానికి కారణమైన సుకుమార్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.’ అని బన్నీ ట్వీట్ చేశారు. ఐతే, మరోవైపు కృతి సనన్‍ మిమీ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్నారు. ఇక ఈ అవార్డుల వేడుకలో కృతితో సెల్ఫీ దిగారు బన్నీ.

అంతేకాకుండా పుష్ప చిత్రంలో ఫేమస్ అయిన ‘తగ్గేదెలే’ సిగ్నేచర్ మూవ్‍మెంట్ చేస్తూ ఇద్దరూ సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప‌2 సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది. పుష్ప‌2లో బ‌న్నీ మెగాస్టార్ వీరాభిమానిగా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇంద్ర రిలీజ్ టైమ్‌లో పుష్ప‌రాజ్ థియేట‌ర్ ద‌గ్గ‌ర చేసే సంద‌డిని సుకుమార్ చాలా స్పెషల్‌గా తెర‌కెక్కించాడ‌ని తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా అల్లు అర్జున్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. తెలుగు సినీ చరిత్రలో 70 ఏళ్లుగా మనకు కాకుండా పోయిన ఈ అవార్డును తొలిసారి అల్లు అర్జున్‌ అందుకోవడం విశేషం. పుష్ప సినిమాకి గాను ఉత్తమ నటుడిగా బన్నీ, బెస్ట్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డు దక్కింది. మొత్తానికి పుష్ప రికార్డుల మోత మోగించింది.

Also Read:టైగర్ నాగేశ్వరరావు..ప్రేక్షకులని అలరిస్తుంది

- Advertisement -