పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవల ఓ వ్యక్తి చెయ్యి పట్టుకుని ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ, “నీతో ఉంటే సంతోషంగా, శాంతంగా ఉంటుంది. నా చెయ్యి ఎప్పటికీ విడువకు. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు” అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేణూ తన పిల్లలు, స్నేహితులతో కలిసి గోవాలో విహరిస్తున్నారు. అయితే తన స్నేహితులు తనకు కాబోయే భర్త చేసే మెసేజ్‌లు చదివే ప్రైవసీని ఇవ్వడంలేదంటుంది.
ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. స్విమ్ డ్రెస్‌లో ఫోన్ చూస్తున్నప్పుడు తీసిన ఫొటోను రేణూ పోస్ట్ చేశారు. ఈ ఫొటోను తన స్నేహితులు తీశారట. అయితే ఆ సమయంలో తాను తనకు కాబోయే భర్త చేసే మెసేజ్‌లను చదువుతున్నానని, కానీ తన స్నేహితులు ఫొటోలు తీస్తూ తనకు ప్రైవసీ ఇవ్వడంలేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే త్వరలో రేణూ పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. ఈ పోస్టు చూసిన వారంతా రేణూ వివాహం త్వరలోనే జరగబోనుందని తేల్చేస్తున్నారు.