రేణూ దేశాయ్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ అవుతున్న ఫోటో..

280
Renu Desai
- Advertisement -

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఓ వ్యక్తి చేయి పట్టుకొని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో షేర్‌ చేసింది రేణు. అంతేకాదు ఆ వ్యక్తి గురించి వివరిస్తూ ఓ కవితను కూడా రేణుదేశాయ్ పోస్టు చేయడంతో సంచలనంగా మారింది.

అంతేకాదు కొద్దిరోజుల క్రితం రేణూ తన పిల్లలు, స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లారు. అయితే తన స్నేహితులు తనకు కాబోయే భర్త చేసే మెసేజ్‌లు చదివే ప్రైవసీని ఇవ్వడంలేదంటు తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. స్విమ్‌ డ్రెస్‌లో ఫోన్‌ చూస్తున్నప్పుడు తీసిన ఫొటోను రేణూ పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులు చూసిన వారంతా రేణూ వివాహం త్వరలోనే జరగబోనుందని తేల్చేస్తున్నారు. రేణు చేస్తున్న పోస్ట్‌లపై నెటీజన్లు, పవన్‌ అభిమానులు రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు.

Renu Desai

ఈ నేపథ్యంలో రెండో పెళ్లి వద్దని సలహా ఇచ్చిన ఓ అభిమానికి రేణూ దేశాయ్ ఘాటైన సమాధానం ఇచ్చింది. “మేడమ్… మీరు మరో వివాహం చేసుకోవద్దు. అలా చేస్తే, మీకు, బయటివారికి తేడా ఏముంటుంది? అసలు పవన్ కల్యాణ్, మీలాంటి అందమైన భార్యను ఎందుకు వదులుకున్నారో అర్థం కావడం లేదు” అని కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన రేణు, “ఇలాంటి క్రేజీ అబ్బాయిలు వారి తల్లులు, అక్క చెల్లెళ్లతో ఎలా ప్రవర్తిస్తుంటారో? వారి మానసిక ఆరోగ్యం గురించి చింతిస్తున్నాను” అని వ్యాఖ్యానించింది.

ఇక మరో అభిమాని స్పందిస్తూ, “మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే గొడవలు వస్తాయి. నా దేవుడికి ఎలాంటి సమస్యా రాకూడదు. ఏం చేసినా ఆలోచించి చేయండి” అని వ్యాఖ్యానించగా, “క్రేజీ” అని రేణు కామెంట్ పెట్టింది. ఇక పలువురు ఆమె వివాహానికి మద్దతిస్తూ వ్యాఖ్యలు చేస్తుంటే, తనకు మద్దతిస్తున్న అబ్బాయిలకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాలని ఉందని పేర్కొంది. వారి తల్లిదండ్రులు వారిని చాలా చక్కగా పెంచారని కితాబిచ్చింది.

అంతేనా తాజాగా రేణు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మరో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఈ ఫోస్టు చేయడం ద్వారా తనకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని ఆమె అఫీషియల్‌గా ప్రకటించారు. తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై రేణూ చెయ్యేసిన ఫొటోలో నిశ్చితార్థపు ఉంగరాలు గమనించవచ్చు. జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలపై స్పష్టత ఇ‍వ్వకపోయినా.. ఎంగేజ్‌ మెంట్‌ జరిగిన విషయాన్ని మాత్రం తన పోస్ట్‌తో వెల్లడించేశారు.

- Advertisement -