కళ్యాణ్ ‘విజేత’ ఆడియోకు అంతా రెడీ..

263
kalyandev
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. చిన్నల్లుడికి మొదటి నుంచి చిరు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. 80ల నాటి తన హిట్ సినిమా టైటిల్ ఇచ్చాడు. కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా నిర్మాణ బాధ్యత వారాహి చలనచిత్రం లాంటి పేరున్న బ్యానర్ తీసుకోవడం వెనుకా మెగాస్టార్‌యే ఉన్నాడు.

Vijetha

రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ – జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక ప్రారంభం కానుంది.

chiranjeevi

ఈ వేడుకకి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉండగా నందమూరి బాలకృష్ణ కూడా సందడి చేయనున్నారని సమాచారం, ఆయనతో పాటు చరణ్ .. అల్లు అర్జున్ కూడా రానున్నట్టు చెబుతున్నారు. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ కు జోడీగా మాళవిక నాయర్ నటిస్తోంది.

- Advertisement -