జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌తో విడాకుల వ్యవహారంపై తాను నోరు విప్పానంటే ఆయన అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని రేణూ దేశాయ్ హెచ్చరించారు. విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లు తాను మౌనంగా ఉన్నానని, అలా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞతగా ఉండాలని, మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. విడాకుల వ్యవహారం వెనుకున్న వాస్తవాలను చెబితే అవివేకులైన పవన్ అభిమానులకు గర్వభంగం అవుతుందని తీవ్రస్థాయిలో రేణు మండిపడింది.
ఈవిధంగా పవన్ ఫ్యాన్స్ పై ఆగ్రహంతో రగిలిపోయింది రేణుదేశాయ్. ఇలాంటి తిట్లు, బూతులు ఎక్కువగా ఉన్నాయని తాజాగా ట్విట్టర్ నుంచి ఆమె తప్పుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం కొనసాగుతోంది. అయితే అక్కడ కూడా ఆమెకు ఇలాంటి ఆన్ లైన్ వేధింపులు తప్పలేదు. నువ్వు తప్పుచేస్తున్నావంటూ ఓ అభిమాని రాసిన కామెంట్‌కు పై విధంగా ఘాటుగా సమాధానమిచ్చింది రేణుదేశాయ్.
తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలోకి ప్రవేశించి ఏడుపు గొట్టు కథలు చెప్పే అధికారం పవన్ కల్యాణ్ అభిమానులకు లేదని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ అభిమానుల నెగటివిటీని తానెందుకు భరించాలని ప్రశ్నించారు.. నేను దేవుడ్ని గట్టిగా ప్రార్థిస్తున్నాను. ఒక రోజు వస్తుంది. ఆ రోజు నేను నా సోషల్ మీడియా ఎకౌంట్ లో ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటాను. నా సోషల్ మీడియా పేజీలో కేవలం నా గురించి, నా పని గురించి మాత్రమే మంచి కామెంట్స్ చదువుకునే రోజు కోసం ప్రార్థిస్తున్నాను. అంటు రేణు వ్యాఖ్యనించారు.